Rajendra Prasad: ఎట్టకేలకు రాజేంద్ర ప్రసాద్ స్పందించారు. ఆయన క్షమాపణలు కోరుతూ వివాదానికి ముగింపు పలికారు. ఇటీవల కాంతారావు అవార్డు ఫంక్షన్‌కు హాజరైన ఆయన మాట్లాడుతూ.. తమిళ లెజెండరీ నటుడు, దివంగత ముఖ్యమంత్రి ఎంజీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కాంతారావును జానపదాను చూసి ఆయన భయపడేవారని, ఆయన కనిపిస్తే ప్యాంటు తడిపేసుకునేవారంటూ మాటలు తూలిని సంగతి తెలిసిందే. ఆయన కామెంట్స్ తమిళులు అంత ఆగ్రహంతో ఊగిపోయారు.
నన్ను క్షమించండి
తాము దైవంగా కొలిచే ఎంజీఆర్‌పై అనుచితంగా మాట్లాడిన ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన వ్యాఖ్యలను తమిళ్,తెలుగు ఇండస్ట్రీ సైతం తప్పుబట్టింది. తన వ్యాఖ్యలను సరి చేసుకుంటూ రాజేంద్ర ప్రసాద్ క్షమాపణలు చెప్పాలని అన్నారు. ఈ మేరకు రాజేంద్ర ప్రసాద్ తన తప్పిదాన్ని తెలుసుకుని తమిళులను క్షమాపణలు కోరారు. ఈ మేరకు ఆయన తమిళంలో మాట్లాడుతూ వీడియో విడుదల చేశారు. “ప్రతి ఒక్కరినికి నమస్కారం. నేను తెలుగు నటుడు రాజేంద్ర ప్రసాద్. రెండు రోజుల క్రితం కాంతారావు సార్ అవార్డు ఫంక్షన్‌లో నేను మాట్లాడిన మాటలు వివాదంగా మారాయి. అవి నేను ఉద్దేశపూర్వకంగా చేసినవి కావు. అనుకోకుండ నా నోటి నుంచి మాటలు దోర్లాయి.
ఎంజీఆర్ ని అనే ధైర్యం లేదు
తమిళ సినీ ప్రేక్షకుల మాదిరిగానే నేను కూడా ఎంజీఆర్‌ని దైవంలా భావిస్తాను. తెలుగు నటుడు కాంతారావును ప్రశంసించే క్రమంలో నా నోటి నుంచి ఆ మాటలు దోర్లాయి. అవి ఉద్దేశపూర్వకంగా చేసినవి కాదు. కానీ, కొంతమంది కావాలని ఈ అంశాన్ని పెద్దది చేస్తున్నారు. ఆయనపై వ్యాఖ్యలు చేసేంత ధైర్యం నాకుందా? చెన్నై ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో నేను శిక్షణ తీసుకుంటున్న సమయంలో ఎంజీఆర్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. మేము నటిస్తుంటే వచ్చి చూసేవారు. అలాంటి గొప్ప వ్యక్తి గురించి నేను మాట్లాడగలనా? నా వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే నన్ను క్షమించండి. భవిష్యత్తు ఎప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయను” అంటూ తమిళంలో క్షమాపణలు కోరారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Rajendra Prasad has apologised! 📢#RajendraPrasad #MGR
pic.twitter.com/2Nce1wU76z— Cine World Entertainment 🌍 (@CineWorldEnt) March 13, 2026
కాగా రాజేంద్ర ప్రసాద్ కామెంట్స్‌పై తమిళ హీరో విశాల్, నటుడు నాజర్ స్పందించి ఆయన తీరును తప్పబట్టిన సంగతి తెలిసిందే. మీలాంటి గొప్ప నటులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా బాధగా ఉందని, లెజెండరీ నటులైన ఎంజీఆర్‌పై అలాంటి కామెంట్స్ చేయడం సరికాదన్నారు. వెంటనే మీ తప్పుని సరిచేసుకోని క్షమాపణలు చెప్పి ఈ వివాదానికి ముగింపు పలకాలని విశాల్ పేర్కొన్నాడు. అలాగే నాజర్ కూడా రాజేంద్ర ప్రసాద్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.

