Sunday, November 16, 2025
Homeచిత్ర ప్రభCoolie Twitter Review: ‘కూలీ’ ప్రీమియర్ టాక్.. నెటిజన్స్ ఏమంటున్నారంటే

Coolie Twitter Review: ‘కూలీ’ ప్రీమియర్ టాక్.. నెటిజన్స్ ఏమంటున్నారంటే

సూపర్ స్టార్ రజినీకాంత్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘కూలీ’. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రారంభం నుంచి భారీ అంచనాలను పెంచింది. లోకేష్ తన యూనివర్స్‌లో భాగంగా దీన్ని రూపొందించాడు. రజినీకాంత్‌తో పాటు నాగార్జున అక్కినేని, ఆమీర్ ఖాన్, ఉపేంద్ర, శ్రుతీ హాసన్, సత్యరాజ్ వంటి భారీ తారాగణం నటించారు.

- Advertisement -

సినిమా ప్రీ సేల్స్ బుకింగ్స్ పరంగా దూసుకెళ్తోంది. ఇప్పటికే ప్రీమియర్స్ చూసిన నెటిజన్స్ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. రజినీకాంత్ సినిమాలో భారీ తారాగణం ఉన్నప్పటికీ తనదైన స్వాగ్‌తో అందరినీ డామినేట్ చేశాడని కామెంట్ చేశాడు.

కూలీ ఫస్టాఫ్ బావుందని, రజినీకాంత్ ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్, నాగార్జున్ స్టైల్, ఇతర నటీనటుల పెర్ఫామెన్స్ తో పాటు అనిరుద్ సంగీతం బావుంది. ఇంటర్వెల్ సీన్ అయితే పీక్స్ అంటూ తన ఓపినియన్ ని షేర్ చేశాడు.

సినిమా స్టార్టింగ్ నుంచి విజిల్స్, సౌండ్ మామూలుగా లేదని, ఇది సినిమాలాగా లేదని పండుగను తలిపిస్తుందని ఓ నెటిజన్ పేర్కొన్నాడు.

ఇది పార్టీ టైమ్.. కూలీ ప్రపంచం మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తుంది. బ్లాస్టో బ్లాస్ అంటూ ఓ నెటిజన్ తన సంతోషాన్ని తెలియజేశాడు.

యు.ఎస్ నుంచి కూలీ సినిమాకు అద్భుతమైన రిపోర్ట్స్ వచ్చాయి అంటూ ఓ జర్నలిస్ట్ తన ఓపినియన్ షేర్ చేసుకున్నాడు.

 

రజినీకాంత్ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 50 సంవత్సరాలు అవుతుంది. ఈ సందర్భంలో విడుదలైన కూలీ సినిమా ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ అనటంలో సందేహం లేదు. ఈ సినిమా ప్రీమియర్స్ తోనే 100 కోట్లు సాధించటం విశేషం. సినిమాతో తమిళ సినిమా వెయ్యి కోట్ల క్లబ్ లోకి చేరాలని కోలీవుడ్ ఇండస్ట్రీ భావిస్తోంది. సన్ పిక్చర్స్ మేకింగ్ లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను రూపొందించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad