Friday, February 13, 2026
Homeచిత్ర ప్రభRajinikanth: ‘నరసింహ’ సీక్వెల్ ప్లాన్ చేస్తోన్న తలైవర్.. టైటిల్ ఫిక్స్?

Rajinikanth: ‘నరసింహ’ సీక్వెల్ ప్లాన్ చేస్తోన్న తలైవర్.. టైటిల్ ఫిక్స్?

Rajinikanth: సూపర్‌స్టార్ రజినీకాంత్ డిసెంబ‌ర్ 12న పుట్టిన‌రోజు సెల‌బ్రేట్ చేసుకుంటున్నారు. ఈసారి బ‌ర్త్ డే ఎంతో స్పెష‌ల్ కానుంది. అందుకు కార‌ణం… తన క్లాసిక్ బ్లాక్‌బస్టర్ ‘పడయప్పా’ రీ రిలీజ్ కానుంది. దీన్ని తెలుగులో ‘న‌ర‌సింహ’ పేరుతో విడుద‌ల చేశారు. 1999లో విడుద‌లైన ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ మూవీగా నిలిచింది. ఈ సినిమా హ‌క్కుల‌ను ఎవ‌రికీ ఇవ్వ‌కుండా త‌న ద‌గ్గ‌రే ఉంచుకున్న ర‌జినీకాంత్ ఇప్పుడు రీ రిలీజ్‌కు ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా దీనికి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్టు స్వయంగా వెల్లడించారు. ప్ర‌స్తుతం రజినీకాంత్ తన 172వ చిత్రం ‘జైలర్ 2’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది జూన్‌లో విడుదల కాబోతుంది.

- Advertisement -

Also Read- Anil Ravipudi: మెగాస్టార్ కాబట్టే మళ్ళీ ఛాన్స్ ఇచ్చారు- అనిల్ రావిపూడి

తాజాగా ర‌జినీకాంత్ పడయప్పా సీక్వెల్ గురించి ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారాయి. 1999లో విడుదలై తమిళ, తెలుగు బాక్సాఫీసుల వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసిన ‘పడయప్పా’ సినిమాను కె.ఎస్. రవికుమార్ తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో రమ్యకృష్ణ పోషించిన ‘నీలాంబరి’ పాత్ర అప్పట్లో నేషనల్ లెవెల్‌లో సెన్సేష‌న్ అయ్యింది. ఆ పాత్రకు ఉన్న క్రేజ్ కారణంగా సీక్వెల్‌కు ‘నీలాంబరి’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు రజినీకాంత్ తెలిపారు.

పడయప్పా (న‌రసింహా) క్లైమాక్స్‌లో “తర్వాత జన్మలో అయినా ప్రతీకారం తీర్చుకుంటాను” అంటూ నీలాంబరి ఇచ్చిన ఛాలెంజ్‌ను ఆధారంగా చేసుకుని కొత్త కథను డెవ‌ల‌ప్ చేసే ప‌నిలో ఉన్నార‌ట తలైవ‌ర్‌. కథ కుదిరిన తర్వాతే అధికారిక ప్రకటన చేస్తామని సూప‌ర్‌స్టార్‌ స్పష్టం చేశారు. మరోవైపు రజినీకాంత్ 173వ సినిమా గురించి కూడా అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది. కమల్ హాసన్ నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్‌ నుంచి దర్శకుడు సుందర్‌.సి క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా తప్పుకున్నారు. ప్రస్తుతం కమల్ హాసన్ టీమ్ కొత్త దర్శకుడి కోసం కొత్త క‌థ‌ల‌ను వింటున్నారు. ఒకవైపు ‘జైలర్ 2’, మరోవైపు ‘నీలాంబరి’ సీక్వెల్.. ఈ రెండు ప్రాజెక్టులతో తలైవర్ మళ్లీ భారీ హంగామా చేయబోతున్నారని అభిమానులు ఎదురు చూస్తున్నారు.

Also Read- Krithi Shetty: సినిమా ప్లాపైతే నన్ను ట్రోల్ చేశారు..ఇండస్ట్రీ వద్దనుకున్నా!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News