Friday, September 20, 2024
Homeచిత్ర ప్రభRajinikanth : పుట్టిన రోజుకి ఫ్లాప్ సినిమాని రీరిలీజ్ చేస్తున్న సూపర్ స్టార్

Rajinikanth : పుట్టిన రోజుకి ఫ్లాప్ సినిమాని రీరిలీజ్ చేస్తున్న సూపర్ స్టార్

- Advertisement -

Rajinikanth : ఇటీవల సినిమాలు రీరిలీజ్ కల్చర్ బాగా ఎక్కువైంది. స్టార్ హీరోలు గతంలో తీసిన హిట్ సినిమాలని వాళ్ళ పుట్టిన రోజులకో లేదా ఏదైనా స్పెషల్ అకేషన్ కో రీరిలీజ్ చేస్తున్నారు. ఇలా రీరిలీజ్ చేసిన సినిమాలకి విపరీతమైన స్పందన, భారీగా డబ్బులు కూడా వస్తుండటంతో పలువురు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ కూడా పాత సినిమాలని రీరిలీజ్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

ఇప్పటికే మహేష్ బాబు, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, ప్రభాస్, ధనుష్… సినిమాలు రీరిలీజ్ కాగా త్వరలో చిరంజీవి, రామ్ చరణ్ సినిమాలు రిలీజ్ కానున్నాయి. తాజాగా మరో స్టార్ హీరో సినిమా కూడా రిలీజ్ కాబోతుంది. అయితే అది ఫ్లాప్ సినిమా కావడం విశేషం. చాలా మంది హీరోలు తమ హిట్ సినిమాలనే రీరిలీజ్ చేస్తున్నారు. అయితే సూపర్ స్టార్ రజినీకాంత్ మాత్రం తన ఫ్లాప్ సినిమాని రీరిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు.

రజినీకాంత్, మనీషా కొయిరాలా జంటగా వచ్చిన బాబా సినిమా దైవానుగ్రహాన్ని జోడించి కమర్షియల్‌ ఫార్మేట్‌లో తెరకెక్కించారు. రజినీకాంత్ బయట ఆధ్యాత్మిక వ్యక్తి కావడంతో ఈ సినిమాని చాలా ఇష్టంగా చేశారు. కానీ ఈ సినిమా ఫ్లాప్ అయింది. అందుకే ఈ సినిమాని మళ్ళీ రీరిలీజ్ చేస్తున్నారు. అయితే సాధారణంగా రీరిలీజ్ చేస్తే గత సినిమాలని ఇప్పటి టెక్నాలజీకి మార్చి రిలీజ్ చేస్తారు. కానీ బాబా సినిమాకి రజినీకాంత్ మళ్ళీ డబ్బింగ్ కూడా చెప్పడం విశేషం. ఇటీవలే రజినీకాంత్ బాబా సినిమాకి డబ్బింగ్ చెప్తున్న ఫోటో బయటకి వచ్చింది.

డిసెంబర్ 12 రజినీకాంత్ పుట్టిన రోజునాడు బాబా సినిమాని తెలుగు, తమిళ్ లో రీరిలీజ్ చేయనున్నట్టు తెలిపారు. దీంతో ఫ్లాప్ సినిమా అయినా రజినీకాంత్ స్టైల్ కోసం సినిమాకి వెళ్తామంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. అప్పుడు ఈ సినిమా ఫ్లాప్ అయినా ఇప్పుడు మాత్రం భారీగానే కలెక్షన్స్ వస్తాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News