Coolie Songs: రజనీకాంత్ (Rajinikanth) హీరోగా, లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో తెరకెకెక్కుతున్న తాజా చిత్రం ‘కూలీ’ (Coolie). ఈ సినిమా ఆగస్టు 14వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఈ సినిమాకు భారీ అంచనాలు నెలకొన్నాయి. విడుదలైన ట్రైలర్, పాటలు, ఇతర అప్‌డేట్‌లు సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి. ఈ క్రమంలోనే, సింగపూర్ పోలీసులు (Singapore Police) ‘కూలీ’ సినిమాకు ఇచ్చిన ‘పవర్ హౌస్’ పెర్ఫార్మెన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అనిరుధ్ సంగీత సారథ్యంలో రూపొందిన ‘కూలీ’ సినిమాలోని పాటలు విపరీతమైన ఆదరణను పొందుతున్నాయి, ముఖ్యంగా ‘పవర్ హౌస్’ పాటకు మంచి స్పందన లభించింది. ఈ పాటకు సింగపూర్ పోలీసులు రీల్ చేయగా, ఆ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది. ఈ వీడియోలో పోలీసులు తమ చొక్కాలపై కేవలం ‘పోలీస్’ అని మాత్రమే కనిపించేలా చేశారు. వారు కేవలం నెమ్మదిగా నడుస్తూ వెళ్తుండగా, ఈ వీడియోకు ‘పవర్ హౌస్’ పాటను జోడించి స్లో మోషన్‌లో రీల్ చేసి విడుదల చేశారు.
ఈ వీడియో అభిమానులను ఎంతగానో ఆకట్టుకోవడమే కాకుండా, సింగపూర్‌లోనూ ‘కూలీ’ సినిమాకు ఎంత క్రేజ్ ఉందో స్పష్టం చేస్తోంది. ఈ వీడియో వైరల్ కావడంతో అభిమానులు విభిన్నంగా స్పందిస్తున్నారు. ‘సింగపూర్ పోలీసులకు కూడా రజనీకాంత్ క్రేజ్ ఏంటో అర్థమైంది’ అని కొందరు కామెంట్లు చేయగా, మరికొందరు లోకేష్ కనగరాజ్‌ని ఉద్దేశించి ‘ఏంటి లోకేష్ భయ్యా.. సింగపూర్ పోలీసులను కూడా మీ ఎల్సీయూలో భాగం చేస్తున్నారా?’ అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ‘సింగపూర్ పోలీసులు చాలా బెస్ట్ సాంగ్ సెలెక్ట్ చేసుకున్నారు’ అని మరికొందరు ఈ రీల్ వీడియోపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
Singapore Police Force, channeling Tamil Superhit Movie #Coolie vibes, reporting for National Day duty. See 🔥 clip. HC Wonghttps://t.co/ey5u0c2uzz#Arivu #Rajinikanth #Powerhouse #TamilNadu #TamilRoots pic.twitter.com/rS2S4KCGpn
— Singapore in India (@SGinIndia) August 9, 2025
‘కూలీ’ సినిమా ఆగస్టు 14న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. తమిళంతో పాటు తెలుగులో కూడా ఈ సినిమాకు భారీ ఆదరణ లభిస్తుందని తెలుస్తోంది. ఈ పాన్ ఇండియా చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోలైన అమీర్ ఖాన్, సంజయ్ దత్ కూడా భాగమయ్యారు. అలాగే ఉపేంద్ర, కింగ్ నాగార్జున, సత్యరాజ్, శృతి హాసన్ వంటి వారు కీలక పాత్రలలో నటిస్తున్నారు. మోనిక అనే స్పెషల్ సాంగ్ లో పూజా హెగ్డే తళుక్కున మెరిసిన సంగతి తెలిసిందే. ఎన్నో అంచనాల నడుమ వస్తున్న ఈ సినిమా LCU లో భాగం కాదని, అలాగే ఈ సినిమాకు ఎలాంటి సీక్వెల్ కూడా లేదని డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ స్పష్టం చేశారు.
ALSO READ: https://teluguprabha.net/cinema-news/before-ntr-which-telugu-heroes-who-acted-in-bollywood-movies/
మొత్తంగా, సింగపూర్ పోలీసుల నుంచి వచ్చిన ఈ ప్రత్యేక ప్రమోషన్ ‘కూలీ’ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. రజనీకాంత్ అభిమానులు, సినీ ప్రేమికులు ఈ సినిమా విడుదల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.


