Coolte Ott: రజనీకాంత్ కూలీ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అఫీషియల్‌గా కన్ఫామ్ అయ్యింది. సెప్టెంబర్ 11 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూలీ స్ట్రీమింగ్ కాబోతుంది. తెలుగు, తమిళంతో పాటు మలయాళం, కన్నడ భాషల్లో ఈ మూవీ విడుదల కానున్నట్లు అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రకటించింది. ఓ పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నది. హిందీ వెర్షన్ మాత్రం మరో రెండు, మూడు వారాలు ఆలస్యంగా ఓటీటీలోకి రాబోతున్నట్లు సమాచారం.
నెల రోజులు కాకముందే..
రజనీకాంత్ లాంటి స్టార్ హీరో మూవీ థియేటర్లలో రిలీజై నెల రోజులు కాకముందే ఓటీటీలోకి రాబోతుండటం కోలీవుడ్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. కూలీ మూవీలో టాలీవుడ్ హీరో నాగార్జునతో పాటు మలయాళం నటుడు సౌబీన్ షాహిర్ విలన్లుగా నటించారు. బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్‌ఖాన్ గెస్ట్ రోల్ చేశాడు. ఉపేంద్ర, సత్యరాజ్, శృతిహాసన్ కీలక పాత్రలు పోషించారు.
Also Read – Crime : ప్రియుడి మోజులో పడి భర్త, 22 ఏళ్ల కూతురిని చంపిన కసాయి తల్లి!
ఐదు వందల కోట్ల కలెక్షన్స్…
కూలీ మూవీకి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించాడు. ఆగస్ట్ 14న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ఐదు వందల కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లనే రాబడుతోంది. బుధవారం రోజు కూలీ మూవీ కోటి రూపాయల వరకు కలెక్షన్స్ దక్కించుకున్నది. 21 రోజుల్లో వరల్డ్ వైడ్‌గా 514 కోట్ల గ్రాస్, 260 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ దక్కించుకున్నది.
తొలిరోజు నుంచి కూలీ మూవీ నెగెటివ్ టాక్‌ను మూటగట్టుకుంది. నిర్మాతలకు యాభై కోట్లకుపైనే ఈ సినిమా నష్టాలను మిగిల్చినట్లు సమాచారం. రజనీకాంత్, నాగార్జున యాక్టింగ్ బాగున్నా డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ టేకింగ్‌పై దారుణంగా విమర్శలొచ్చాయి. రొటీన్ రివేంజ్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కించారంటూ లోకేష్‌ను రజనీకాంత్ ఫ్యాన్స్ ట్రోల్ చేశారు. కూలీ మూవీకి అనిరుధ్ మ్యూజిక్ అందించాడు.
కూలీ కథ ఇదే…
సైమన్ (నాగార్జున) వైజాగ్‌లో డాన్‌గా చెలామణీ అవుతుంటాడు. సైమన్‌కు దయాల్ (సౌబీన్ షాహిర్) నమ్మినబంటు. సైమన్ అక్రమ వ్యాపారాలు అన్ని దయాల్ చూసుకుంటుంటాడు. సైమన్‌తో పనిచేసే రాజశేఖర్ (సత్యరాజ్) హత్యకు గురవుతాడు. స్నేహితుడి మరణానికి కారణమైన వాళ్లపై రివేంజ్ తీర్చుకోవడానికి దేవా (రజనీకాంత్) రంగంలోకి దిగుతాడు. అసలు రాజశేఖర్ ఎలా చనిపోయాడు? దేవా గతం ఏమిటి? దేవాతో దహా(ఆమిర్‌ఖాన్), కాలేష్(ఉపేంద్ర), ప్రీతిలకు(శృతి హాసన్) ఉన్న సంబంధం ఏమిటి, సైమన్, దయాలకు అక్రమాలకు దేవా ఎలా చెక్ పెట్టాడు అన్నదే ఈ మూవీ కథ.
Also Read – Balakrishna : నిమ్మకూరులో బాలయ్య సందడి – పదవులకు నేనే అలంకారం!

