Thalaivar173: రజినీకాంత్, కమల్ హాసన్ కలిసి ఒక ప్రాజెక్ట్ చేయబోతున్నారనే వార్త సినీ అభిమానులకు పెద్ద ట్రీట్ లాంటిది. రజినీకాంత్ 173వ సినిమాను కమల్ హాసన్ తన నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ లెజెండరీ కాంబినేషన్ గురించి అధికారిక ప్రకటన వచ్చినప్పటి నుంచి అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే, ఈ ప్రాజెక్ట్‌కు మొదట దర్శకుడిగా ప్రకటించిన సుందర్. సి కొన్ని కారణాల వల్ల తప్పుకోవడంతో, ఇప్పుడు కొత్త దర్శకుడి కోసం చిత్రబృందం అన్వేషిస్తోంది.
ALSO READ: Akhanda 2: 3Dలో అఖండ 2.. బోయపాటి భారీ స్కెచ్.. పూనకాలు పక్కా
తెరపైకి మాజీ అల్లుడు ధనుష్ పేరు!
సుందర్. సి స్థానం ఖాళీ అవ్వడంతో, ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను ఎవరు డైరెక్ట్ చేస్తారనే చర్చ మొదలైంది. ఈ క్రమంలోనే స్టార్ నటుడు, మంచి దర్శకుడిగా పేరున్న ధనుష్ పేరు బలంగా వినిపిస్తోంది. ధనుష్ ఇప్పటికే ‘పవర్ పాండి’, ‘రాయన్’ లాంటి సినిమాలను డైరెక్ట్ చేసి దర్శకుడిగా తన సత్తా నిరూపించుకున్నాడు. అంతేకాక, రజినీకాంత్‌కు మాజీ అల్లుడు కావడంతో, ఈ కాంబినేషన్‌కు మరింత బజ్ వచ్చింది. ధనుష్ దర్శకత్వంలో మామ రజినీ, నిర్మాత కమల్ కలిసి పనిచేస్తే అది ఒక మంచి కాంబో అవుతుందని అంతా భావిస్తున్నారు.
ALSO READ: Varanasi: మహేష్ బాబు ‘వారణాసి’ కథ మొత్తం ఆ దేవత చుట్టే!
అధికారిక ప్రకటన కోసం ఎదురుచూపు!
ప్రస్తుతానికి, ధనుష్ దర్శకత్వం వహిస్తారనేది కేవలం ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న ఊహాగానం మాత్రమే. దీనిపై నిర్మాతల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కమల్ హాసన్ మాత్రం మంచి స్క్రిప్ట్ దొరికితే కొత్త వారికి కూడా అవకాశం ఇస్తామని చెప్పడం ఈ సినిమాని ఎవరు డైరెక్ట్ చేస్తారా అన్న ఆశక్తిని పెంచుతూ వచ్చింది. ఈ క్రేజీ కాంబినేషన్ నిజమైతే, అభిమానులకు మంచి ట్రీట్ అవుతుంది. అందుకే, త్వరలోనే ఒక స్పష్టత వస్తుందని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

