Rajinikanth Dharman movie second schedule video : సూపర్ స్టార్ రజనీకాంత్, యూనివర్సల్ హీరో కమల్ హాసన్ మధ్య అరుదైన స్నేహానుబంధం ఉంది. భారతీయ చలనచిత్ర రంగంలో ఐదు దశాబ్దాలకు పైగా అగ్రస్థానంలో కొనసాగుతున్న ఈ ఇద్దరు దిగ్గజాలు ఇప్పుడు నటుడు – నిర్మాతగా మొదటిసారి ‘ధర్మన్’ చిత్రం కోసం కలిసి పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టైటిల్, ‘ది డెడ్లీ డాక్టర్’ అనే పవర్‌ఫుల్ ట్యాగ్‌లైన్‌తో కూడుకున్న ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. తాజాగా ఈ చిత్రం రెండో షెడ్యూల్ పూర్తయింది.
ఈ సందర్భంగా రిలీజ్ చేసిన వీడియోలో సూపర్ స్టార్ తనదైన చరిష్మా, ప్రజెన్స్ తో అదరగొట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారతీయ చలనచిత్ర రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నయువ దర్శకులలో ఒకరిగా పేరు తెచ్చుకున్న అశ్వత్ మారిముత్తు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్‌తో పాటు దక్షిణాది చిత్రసీమలో అత్యంత ప్రజాదరణ పొందిన నటి సిమ్రాన్, తమిళ, తెలుగు, హిందీ చిత్రాలలో గుర్తింపు పొందిన రాశీ ఖన్నా ఇందులో నటిస్తున్నారు.
అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా… భారతీయ చలనచిత్ర రంగంలో అత్యంత అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలను రూపొందించడంలో పేరుగాంచిన జాతీయ అవార్డు గ్రహీతలు అన్బరివ్ ద్వయం యాక్షన్ కొరియోగ్రఫీని సమకూరుస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ గా నికేత్ బొమ్మిరెడ్డి , కార్తీక్ రాజ్‌కుమార్ ప్రొడక్షన్ డిజైనర్‌గా, ప్రదీప్ ఇ. రాఘవ్ ఎడిటర్‌గా, అన్నాదురై ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. డిస్నీ సంస్థ దీనికి సహ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తుండగా…రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ హాసన్, ఆర్.మహేంద్రన్ నిర్మిస్తున్నారు.

