Rajinikanth: సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి ఇండస్ట్రీలో ఒక పెద్ద వార్త చక్కర్లు కొడుతోంది. ఆయన ఆ మూడు సినిమాలు పూర్తి చేసి, ఆ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించబోతున్నారట. ప్రస్తుతం ఆయన లైనప్‌లో ఉన్న మూడు సినిమాల తర్వాతే ఈ నిర్ణయం ఉండవచ్చని ఇండస్ట్రీలో బలంగా మాట్లాడుకుంటున్నారు.
రజనీకాంత్ లాంటి స్టార్‌కి వయస్సు ఒక లెక్క కాదు. 70 ఏళ్లు దాటినా, ఇప్పటికీ యంగ్ హీరోలకు పోటీనిస్తూ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాడు. అందుకే ఈ రిటైర్మెంట్ వార్త విన్న అభిమానులు కాస్త ఆందోళనలో ఉన్నారు. రజనీకాంత్ ప్రస్తుతం వరుసగా మూడు భారీ ప్రాజెక్టులకు ఓకే చెప్పారని తెలుస్తోంది. ఈ మూడు సినిమాలు ఆయన కెరీర్‌లో చాలా ముఖ్యమైనవి కానున్నాయి.
ALSO READ: https://teluguprabha.net/cinema-news/over-confidence-in-tollywood-promotions/
జైలర్ 2: 2023లో విడుదలై సంచలనం సృష్టించిన ‘జైలర్’ సినిమాకి సీక్వెల్ ఇది. డైరెక్టర్ నెల్సన్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఈ సీక్వెల్‌లో కూడా అదిరిపోయే సీన్స్ సిద్ధం చేస్తున్నారు అని తెలుస్తుంది. ‘జైలర్ 2’ తర్వాత రజనీకాంత్ దర్శకుడు సుందర్ సి తో కలిసి పనిచేయనున్నాడు. వీళ్లిద్దరూ కలిసి దాదాపు 28 ఏళ్ల క్రితం ‘అరుణాచలం’ అనే బ్లాక్‌బస్టర్ సినిమా తీశారు. ఇన్నేళ్ల తర్వాత వీరి కలయికపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
కమల్ హాసన్‌తో మల్టీస్టారర్
రజనీకాంత్, కమల్ హాసన్‌ల స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దశాబ్దాల తర్వాత ఈ ఇద్దరు కలిసి ఒక సినిమాలో నటించబోతున్నారు. ఈ సినిమాను కమల్ హాసన్ స్వయంగా తన నిర్మాణ సంస్థ ‘రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్’ ద్వారా నిర్మించబోతున్నాడు. ‘జైలర్ 2’ డైరెక్టర్ నెల్సనే ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు అని టాక్ గట్టిగా వినిపిస్తోంది.
ఇండస్ట్రీ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం, కమల్ హాసన్‌తో కలిసి చేసే ఈ మల్టీస్టారర్ సినిమానే రజనీకాంత్ చివరి సినిమా అయ్యే అవకాశం ఉందట. తన సినీ ప్రయాణాన్ని తన అత్యంత ఆత్మీయ మిత్రుడు నిర్మించే సినిమాలో ముగించడం ఒక గొప్ప ‘గుడ్ బై’ అవుతుందని రజనీకాంత్ గారు భావిస్తున్నట్లు తెలుస్తుంది.
ALSO READ: https://teluguprabha.net/cinema-news/ravi-teja-naveen-polishetty-multistarrer-comedy-entertainer/
అయితే, రజనీకాంత్ గతంలో కూడా రిటైర్‌మెంట్ గురించి చాలా సార్లు వార్తలు వచ్చినా, ఆయన వాటిని పట్టించుకోకుండా సినిమాలు చేస్తూనే వచ్చారు. కాబట్టి, ఈ వార్తలు కేవలం రూమర్స్ మాత్రమే. తలైవా స్వయంగా ప్రకటించేంతవరకు, ఈ మూడు సినిమాలు పూర్తయినా ఆయన నటనను కొనసాగించే అవకాశం లేకపోలేదు.
రజనీకాంత్ సినిమాల్లో కనిపిస్తేనే అభిమానులకు పండుగ. కాబట్టి, ఆయన ఆరోగ్యంగా ఉండి, వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.


