Tuesday, December 9, 2025
Homeచిత్ర ప్రభRaju Weds Rambai: రాజు వెడ్స్ రాంబాయి మూవీని ఫ్రీగా థియేట‌ర్ల‌లో చూడొచ్చు - ఒక్క...

Raju Weds Rambai: రాజు వెడ్స్ రాంబాయి మూవీని ఫ్రీగా థియేట‌ర్ల‌లో చూడొచ్చు – ఒక్క రోజే ఆఫ‌ర్

Raju Weds Rambai: రాజు వెడ్స్ రాంబాయి… ఎలాంటి అంచ‌నాలు లేకుండా చిన్న సినిమాగా రిలీజై సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించింది. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో హ‌ర్ట్ హిట్టింగ్ ల‌వ్‌స్టోరీగా తెర‌కెక్కిన ఈ మూవీలో అఖిల్ రాజ్‌, తేజ‌స్వి రావ్ హీరోహీరోయిన్లుగా న‌టించారు. రా అండ్ ర‌స్టిక్ మూవీతో సాయిలు కంపాటి ద‌ర్శ‌కుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.

- Advertisement -

ఈ చిన్న సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద అద‌ర‌గొడుతోంది. ఆరు రోజుల్లోనే ప‌ది కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఫ‌స్ట్ వీకెండ్‌లోనే బ్రేక్ ఈవెన్ అయ్యింది. నిర్మాత‌ల‌కు లాభాల పంట‌ను పండిస్తోంది. ఈ సూప‌ర్ హిట్ మూవీని ఫ్రీగా థియేట‌ర్ల‌లో చూడొచ్చ‌ని మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. కేవ‌లం మ‌హిళా అభిమానుల‌కు మాత్ర‌మే ఈ ఛాన్స్ క‌ల్పించారు.

“ఆంధ్ర‌ప్ర‌దేశ్‌తో పాటు రాయ‌ల‌సీమ‌లోని తాము ప్ర‌క‌టించిన లిస్ట్‌లోని ఏ థియేట‌ర్‌కు అయినా వెళ్లండి. కౌంట‌ర్ ద‌గ్గ‌ర‌కు వెళ్లి ఫ్రీగా టికెట్ తీసుకొని సినిమా చూడండి. ఈ ఆఫ‌ర్ కేవ‌లం మ‌హిళా అభిమానుల‌కు మాత్ర‌మే” అని ప్రొడ్యూస‌ర్ వేణు ఊడుగుల సోష‌ల్ మీడియా ద్వారా ప్ర‌క‌టించాడు.

Also Read – Mahesh Babu P: ఒక్క ఫ్లాప్‌తో తొమ్మిదేళ్లు గ్యాప్ – సినిమా క‌ష్టాల‌పై ఆంధ్ర కింగ్ తాలూకా డైరెక్ట‌ర్ కామెంట్స్‌

థియేట‌ర్ల లిస్ట్‌ను ఓ పోస్ట‌ర్ ద్వారా వెల్ల‌డించాడు వేణు ఊడుగుల‌. వైజాగ్‌లోని శ్రీక‌న్య‌, జ‌గ‌దాంబ‌, విజ‌యన‌గ‌రం కృష్ణ థియేట‌ర్‌తో పాటు ఇర‌వై ఐదు వ‌ర‌కు థియేట‌ర్ల‌లో ఈ సినిమాను ఫ్రీగా స్క్రీనింగ్ చేయ‌బోతున్నారు. న‌వంబ‌ర్ 27 (నేడు) ఒక్క‌రోజు మాత్ర‌మే ఫ్రీ ఆఫ‌ర్ వ‌ర్తిస్తుంద‌ని వేణు ఊడుగుల పేర్కొన్నారు.

రాజు వెడ్స్ రాంబాయి మూవీతోనే అఖిల్ రాజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తేజ‌స్వి రావ్‌కు మాత్రం ఇది సెకండ్ మూవీ. గ‌తంలో క‌మిటీ కుర్రోళ్లు మూవీలో ఓ నాయిక‌గా క‌నిపించింది. ఈ సినిమాలో హీరో సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ సోద‌రుడు చైత‌న్య జొన్న‌ల‌గ‌డ్డ హీరోయిన్ తండ్రిగా న‌టించాడు. య‌థార్థ ఘ‌ట‌న‌ల ఆధారంగా ద‌ర్శ‌కుడు సాయిలు రాజు వెడ్స్ రాంబాయి మూవీని రూపొందించారు. రాహుల్ మోపిదేవితో క‌లిసి డైరెక్ట‌ర్ వేణు ఊడుగుల రాజు వెడ్స్ రాంబాయి మూవీని నిర్మించ‌గా… వంశీ నందిపాటి, బ‌న్నీవాసు రిలీజ్ చేశారు.

రాజు, రాంబాయి అనే జంట ప్రేమ‌క‌థ‌కు ఎలాంటి అడ్డంకులు ఎదుర‌య్యాయి? కూతురి ప్రేమ‌కు రాంబాయి తండ్రి ఎందుకు అడ్డు చెప్పాడు? రాజుపై క‌క్ష‌తో అత‌డు ఎలాంటి నిర్ణ‌యం తీసుకున్నాడ‌నే పాయింట్‌తో ఈ మూవీ రూపొందింది.

Also Read – TTD: యాంకర్ శివజ్యోతికి టీటీడీ బిగ్ షాక్.. భవిష్యత్తులో శ్రీవారి దర్శనం చేసుకోకుండా నిషేధం!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News