హి ఈజ్ మై లవ్.. అవును.. నేను ఆ పాక్ యాక్టర్ ను పెళ్లి చేసుకుంటా..ఇది రాఖీ సావంత్ చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్. రాఖీ సావంత్ అంటే ఓ సెన్సేషనల్ బాలీవుడ్ ఐటెం సాంగ్స్ క్వీన్ గా వెలుగొంది, ఇప్పుడు ఆల్మోస్ట్ ఆఫర్స్ లేక ఖాళీగా ఉంటున్నారు.
పాక్ ఫిలిం ఇండస్ట్రీలో నటిస్తున్న దోడీ ఖాన్ పోలీస్ ఆఫీసర్ కూడా. ఈ విషయాలు చెబుతూనే తన ఎక్స్ హజ్బెండ్ ఆదిల్ ఖాన్ దురానీపై తన స్టైల్లో ఆమె విరుచుకుపడ్డారు. ఆ ఇడియట్ గురించి మాట్లాడి ఇంకా ఎక్కువ పబ్లిసిటీ ఇవ్వదలచుకోలేదంటూ రాఖీ అనటం వైరల్ గా మారింది. 2023లో ఆదిల్ తో రాఖీ విడిపోయారు. బిగ్ బాస్ 2022లో పాల్గొని, షోలో కంటెస్టంట్ అయిన రితేష్ రాజ్ సింగ్ ను వివాహం చేసుకున్న రాఖీ ఆతరువాత విడిపోయి ఆదిల్ ను వివాహం చేసుకున్నారు. సో.. ఇప్పుడు పాక్ యాక్టర్ తో రాఖీది ఇది 3వ వివాహం అన్నమాట.
‘రాఖీ క స్వయంవర్’ అంటూ ఆమె చేసిన రియాల్టీ షో అప్పట్లో టీవీల్లో పెద్ద దుమారం రేపింది.