Mega Twins: మెగా ఫ్యామిలీలో సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. మెగా వారసుడు రామ్ చరణ్ దంపతులకు కవలలు జన్మించారు.ఈ విషయాన్ని స్వయంగా మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ వేదికగా వెల్లండిచారు.కవలల్లో ఒక మగబిడ్డ, ఒక ఆడబిడ్డ ఉన్నట్లు ఆయన తెలిపారు.దీంతో మెగా కంపౌండ్ తో పాటు..మెగా అభిమానుల్లో సందడి, సంతోషం నెలకొంది.జనవరి 31 శుక్రవారం రాత్రి హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో ఉపాసన ప్రసవించినట్లు చిరంజీవి తెలిపారు.
కొత్త సభ్యులు రావడం..
తల్లి, పిల్లలిద్దరూ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని ఆయన చెప్పారు. కుటుంబంలోకి కొత్త సభ్యులు రావడం తమకు అపారమైన ఆనందాన్ని కలిగించిందని పేర్కొన్నారు. ఇది దేవుడి ఆశీర్వాదంగా భావిస్తున్నామని తెలిపారు. ఈ వార్త వెలువడిన వెంటనే మెగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షల సందేశాలతో స్పందిస్తున్నారు.
Also Read: https://teluguprabha.net/cinema-news/will-janhvi-kapoor-get-applause-from-peddi/
చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ పేర్లతో పెట్టిన పోస్టులో ఈ ఆనందాన్ని అందరితో పంచుకున్నారు. తాతయ్య నానమ్మలుగా మారిన ఆనందాన్ని మాటల్లో చెప్పలేమని పేర్కొన్నారు. తమపై చూపిన ప్రేమకు ప్రార్థనలకు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందేశం అభిమానులను మరింత ఉత్సాహపరిచింది.
With immense joy and a heart full of gratitude, we are happy to share that @AlwaysRamCharan and @upasanakonidela have been blessed with twins – a baby boy and a baby girl.
Both the babies and the mother are healthy and doing well. ✨
Welcoming these little ones into our family…
— Chiranjeevi Konidela (@KChiruTweets) January 31, 2026
క్లింకార అనే పాప..
ఇప్పటికే రామ్ చరణ్ ఉపాసన దంపతులకు ఒక కుమార్తె ఉన్న విషయం తెలిసిందే. 2023లో వీరు క్లింకార అనే పాపకు జన్మినిచ్చారు. ఇప్పుడు కవల పిల్లల రాకతో వారి కుటుంబం మరింత పెద్దదిగా మారింది. ఇప్పుడు మరో ఇద్దరు బుల్లి మెగా వారసులు రావడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు.ఇప్పటికే సోషల్ మీడియాలో మెగా ట్విన్స్ అంటూ అభిమానులు ఈ వార్తను వేడుకలా జరుపుకుంటున్నారు.
రామ్ చరణ్, ఉపాసన ప్రేమ వివాహం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. 2012 జూన్ 14న వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వివాహానంతరం తమ తమ రంగాల్లో విజయవంతంగా ముందుకు సాగారు. రామ్ చరణ్ సినిమాల్లో తనదైన గుర్తింపు సాధించగా ఉపాసన వ్యాపార రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. 2023లో తల్లిదండ్రులుగా మారిన ఈ జంట ఇప్పుడు మరోసారి జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది.
సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు రామ్ చరణ్ ఉపాసన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. సోషల్ మీడియాలో అనేక మంది సెలబ్రిటీలు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అభిమానులు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. మెగా ఫ్యాన్స్ క్లబ్బులు ప్రత్యేక సందేశాలు విడుదల చేశాయి.

