Ram Charan answers on his Political entry: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన పెద్ది జూన్ 4న రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ‘పెద్ది’ అనే గ్రామీణ నేపథ్యమున్న యువకుడి పాత్రలో నటించి తనలోని కొత్త కోణాల్ని పరిచయం చేసేందుకు రామ్ చరణ్ సిద్ధమయ్యారు. బుచ్చిబాబు డైరెక్షన్‌లో తెరకెక్కించిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా మూవీ పాన్ ఇండియా లెవల్‌లో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో గురువారం నిర్వహించిన మూవీ ప్రొమోషన్స్‌లో మీడియా అడిగిన ప్రశ్నలకు రామ్‌చరణ్ ఆసక్తికర సమాధానాలిచ్చారు. పొలిటికల్ ఎంట్రీపై ఎదురైన ప్రశ్నపై చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. “మీ అభిమానులు మిమ్మల్ని సీఎంగా చూడాలనుకుంటున్నారు. భవిష్యత్తులో పాలిటిక్స్‌లోకి వెళతారా?’ అని ప్రశ్నించగా.. ప్రస్తుతానికి తనకు ఆ ఆలోచన లేదని, సినిమా రంగంలో నంబర్ 1 హీరో అనిపించుకోవాలని ఉందని చెప్పారు. తాను రెండు పడవలపై ప్రయాణం చేయాలనుకోవడం లేదన్నారు.
Also read: Sara Tendulkar: బాడీ షేమింగ్ పోస్ట్.. నెటిజన్‌కు సారా టెండూల్కర్ స్ట్రాంగ్ వార్నింగ్
రిస్కీ షాట్స్ సైతం నేనే చేస్తా.. డూప్ పెట్టుకోను..
ఇక, పెద్ది సినిమా గురించి మాట్లాడుతూ.. ‘‘నా కెరీర్‌లో ఎంతో నిజాయతీగా పని చేసిన చిత్రమిదే. రూటెడ్ స్టోరీ ఇది. తన గుర్తింపును కనుగొనే పెద్ది అనే గ్రామీణ యువకుడి ప్రయాణం. ఇలాంటి భిన్నమైన పాత్ర చేయాలంటే శారీరకంగా, మానసికంగా ఎంతో స్ట్రాంగ్‌గా ఉండాలి. క్రీడా నేపథ్యంలో సాగిన కథనం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నమ్మకంగా ఉన్నాం. రిస్కీ షాట్‌లోనూ నేనే నటించేందుకు ఇష్టపడుతాను తప్ప డూప్ పెట్టి తీయాలనుకోను. మా నాన్న 71 ఏళ్ల వయసులోనూ రిస్కీ స్టంట్స్ చేస్తున్నారు. ఆయనే నాకు ఇన్ఫిరేషన్. మనం ఇలాంటి షాట్స్ చేసినప్పుడే ఆయా సన్నివేశాలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయి.’’ అని రామ్‌చరణ్ వివరించారు.

