Friday, April 4, 2025
Homeచిత్ర ప్రభCharan-Upasana : తండ్రి కాబోతున్న రామ్ చరణ్.. చిరంజీవి ట్వీట్..

Charan-Upasana : తండ్రి కాబోతున్న రామ్ చరణ్.. చిరంజీవి ట్వీట్..

- Advertisement -

Charan-Upasana : రామ్ చరణ్ ఇటీవల RRR సినిమాతో భారీ విజయం సాధించి పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఇక నార్త్ లో కూడా చరణ్ కి క్రేజ్ పెరిగింది. ఇప్పటికే చరణ్ కి పలు అవార్డులు కూడా వస్తున్నాయి. గత సంవత్సర కాలం నుంచి చరణ్ తో పాటు చరణ్ అభిమానులు కూడా ఫుల్ జోష్ లో ఉన్నారు. నెక్స్ట్ శంకర్ డైరెక్షన్ లో ఇంకో పాన్ ఇండియా సినిమాని రెడీ చేయబోతున్నాడు. తాజాగా మరో శుభవార్త చెప్పారు చిరంజీవి.

చరణ్, ఉపాసన పెళ్లయి దాదాపు పదేళ్లు అవుతుంది. 2012 జూన్ 14న ఉపాసన, రామ్ చరణ్ పెళ్లి ఘనంగా జరిగింది. ఇన్నాళ్లు వీరు ఎప్పుడు పిల్లలు కంటారు అని అందరూ అడిగేవారు. ఉపాసన, చరణ్ ని పలు ఇంటర్వ్యూలలో కూడా అడిగారు. తాజాగా చరణ్ తండ్రి కాబోతున్నాడని, చరణ్,ఉపాసన తమ ఫస్ట్ చైల్డ్ కి బర్త్ ఇవ్వబోతున్నారని చిరంజీవి ట్వీట్ చేశారు.

చిరంజీవి ట్వీట్ లో.. ఆ ఆంజనేయస్వామి దయవల్ల చరణ్, ఉపాసన త్వరలో తమ ఫస్ట్ చైల్డ్ కి బర్త్ ఇవ్వనున్నారు. అని తెలిపారు. దీంతో అభిమానులు, పలువురు ప్రముఖులు, నెటిజన్లు చరణ్ దంపతులకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పదేళ్ల నుంచి ఈ మాట కోసం ఎదురు చుస్తున్నామంటూ అభిమానులు పోస్టులు చేస్తున్నారు. మొత్తానికి చిరంజీవి తాత కాబోతున్నారు, బుల్లి మెగా పవర్ స్టార్ రాబోతున్నాడు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News