Ram Charan: ‘పెద్ది’.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఫస్ట్ షాట్ తోనే పెద్ది పై అంచనాలను తారా స్థాయిలో నిలిపారు దర్శకుడు బుచ్చిబాబు. దాంతో పెద్ది మూవీ నుంచి ఇంకా ఎలాంటి అప్‌డేట్స్ రాబోతున్నాయో అని ప్రతీ ఒక్కరు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. సుకుమార్ శిష్యుడిగా బుచ్చిబాబుకి కథ, కథనాల విషయంలో మంచి పట్టుంది.. అని ఆయన మొదటి సినిమాతోనే అందరికీ అర్థం అయింది.
రామ్ చరణ్ కెరీర్ లోనే ఓ ఐకానిక్ హిట్ మూవీ “రంగస్థలం” (Rangasthalam). సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో రూపొందింది. ఒక స్టార్ హీరోకి వినికిడి లోపం పెట్టడం అనేది పెద్ద సాహసం. ఆ సాహసమే చేశారు దర్శకుడు సుకుమార్. ఫలితంగా ఇప్పుడు గ్లోబల్ వైడ్‌గా పెద్ది రూపొందుతోంది. పెద్ది మొదలయ్యే వరకూ ఒక టాక్ వినిపించింది. అసలు చరణ్ బుచ్చిబాబుకి డేట్స్ ఎలా ఇచ్చారు అని. ఎప్పుడైతే ఫస్ట్ షాట్ పడిందో ఇలా అనుకున్న వాళ్ళందరి నోర్లు మూతపడ్డాయి.
తాజా సమాచారం ఏంటంటే పెద్ది సినిమా షూటింగ్ ప్రస్తుతం ప్రధాన తారాగణంతో శరవేగంగా జరుగుతుందట. మార్చ్ నెలకే 30 శాతం టాకీపార్ట్ పూర్తవగా, ఆ తర్వాత చరణ్, జాన్వీలపై (Janhvi Kapoor) సాంగ్స్ కూడా కంప్లీట్ చేశారు. ఇక తాజా సమాచారం మేరకు 55 నుంచి 60 శాతం వరకూ చిత్రీకరణ పూర్తైందట. ఈ రకంగా చూస్తే అందరూ అనుకుంటున్న ఒక్క సినిమా అనుభవమే పెద్ది మూవీ షూటింగ్ జెట్ స్పీడ్‌లో పూర్తయ్యేలా చేస్తుందని కాస్త కామెడీగానే కామెంట్స్ చేయవచ్చు. అంతేకదా..బుచ్చిబాబుని తక్కువంచనా వేసే ఇలా కామెంట్స్ చేశారు.
ఏదేమైనా ఆయన మాత్రం పెద్ది మేకింగ్ విషయంలో అసలు కాంప్రమైజ్ కావడం లేదట. ప్రతీ షాట్ విషయంలో ఎంతో జాగ్రత్త తీసుకుంటూ షూట్ చేస్తున్నారట. ఇక సాంగ్స్ విషయంలో కూడా ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ కి ఒక్కో పాటకి మూడేసి పాటలను రిఫరెన్సెస్‌గా ఇచ్చి ఇలాంటి సాంగ్స్ కావాలని అడిగినట్టుగా తెలుస్తోంది. దీన్నిబట్టి చూస్తే పెద్ది మ్యూజిక్ పరంగానూ బుచ్చిబాబు ఎంత ఖత్యేకంగా ఆలోచిస్తున్నారో అర్థమవుతుంది. రెహమాన్ కూడా డెఫినెట్‌గా పెద్ది మూవీకి సాలీడ్ మ్యూజిక్ ఇవ్వబోతున్నారని ఫస్ట్ షాట్ బిజిఎం తోనే అర్థమైంది. కాగా, ఈ మూవీని పాన్ ఇండియా వైడ్‌గా 2026 మార్చ్ 27న రిలీజ్ కి రెడీ చేస్తున్నారు.