Homeచిత్ర ప్రభPeddi Movie: రామ్‌ చరణ్‌ 'పెద్ది' వాయిదా? కొత్త రిలీజ్‌ డేట్‌ ఇదే..!

Peddi Movie: రామ్‌ చరణ్‌ ‘పెద్ది’ వాయిదా? కొత్త రిలీజ్‌ డేట్‌ ఇదే..!

Peddi Movie: రామ్‌ చరణ్‌ మోస్ట్‌ అవైయిటెడ్‌ చిత్రం ‘పెద్ది’. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటుంది. ఓ వైపు ప్రమోషనల్ కార్యక్రమాలతో పాటు షూటింగ్‌ని కొనసాగిస్తుంది. ఏప్రిల్‌ ౩౦న ఈ సినిమాను విడుదల చేస్తామని ఇప్పటికే మూవీ టీం ప్రకటించింది. అయితే, కొద్ది రోజులు పెద్ది రిలీజ్‌పై రకరకాల పుకార్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

- Advertisement -

పెద్ది రిలీజ్ పై సందేహాలు
ఈ సినిమా విడుదల వాయిదా పడే అవకాశం ఉందని, ముందు చెప్పిన తేదీకి పెద్ది రాకపోవచ్చు అంటూ నెట్టింట తెగ ప్రచారంలో చేస్తున్నారు. ఈ పుకార్ల నడుమ.. రామ్‌ చరణ్‌ షూటింగ్‌లో గాయపడటంతో ఇక పెద్ది వాయిదా తప్పదు అనే పరిస్థితి వచ్చింది. అది చిన్న గాయమే..యధావిథిగా చరణ్‌ షూటింగ్‌లో పాల్గొంటారని మేకర్స్‌ స్పష్టం చేసినా మూవీ వాయిదాపై పుకార్లు మాత్రం ఆగడం లేదు. చెప్పిన తేదీకి మాత్రం పెద్ది రాకపోవచ్చే వాదనలు గట్టిగానే వినిపిస్తున్నాయి. కాగా శ్రీకాకుళం స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్‌ దాదాపు చివరి దశకు చేరుకుంది.

గ్లింప్స్, పాటలతో భారీ హైప్
ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌, పాటలు విపరీతంగా వైరల్‌ అయ్యాయి. పెద్ది చికిరి చికిరి సాంగ్‌ యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్‌తో రికార్డు క్రియేట్ చేసింది. ఇక పెద్ది షాట్‌ ఏ రేంజ్‌లో రెస్పాన్స్‌ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రియల్‌ క్రికెట్‌ హీరోలు సతైం ఈ షాట్‌ని అనుసరిస్తూ రీల్స్‌ చేశాడు. దీంతో మూవీ క్రేజ్‌ సౌత్‌ నుంచి నార్త్‌కి కూడా పాకింది. ప్రతి అప్‌డేట్‌ ఒకదాని మించి ఒకటి క్రేజ్‌ తెచ్చుకున్నాయి. దీంతో ఈ మూవీపై భారీ హైప్‌ క్రియేట్‌ అయ్యింది. దీంతో మూవీ రిలీజ్‌ డేట్‌ కోసం ఆడియన్స్‌, ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కొత్త రిలీజ్ డేట్ ఇదేనా?
ఈ క్రమంలో పెద్ది రిలీజ్‌ వాయిదా అనే వార్త అందరిలో ఆందోళన కలిగిస్తోంది. నిజానికి ఈ చిత్రాన్ని చరణ్‌ బర్త్‌ డే సందర్భంగా మార్చి 27న విడుదల చేయాలని మూవీ టీం ప్లాన్‌ చేసింది. కానీ, అది కుదరలేదు. దీంతో ఏప్రిల్‌ ౩౦కి పెద్ది రిలీజ్‌ డేట్‌ ఖరారు చేశారు మేకర్స్‌. అయితే, ఈ డేట్‌కి కూడా పెద్ది రాకపోవచ్చని.. ఒకవేళ వాయిదా పడితే మాత్రం మూవీ రిలీజ్‌ జూన్‌కి వెళ్లనుందంట సోషల్‌ మీడియాలో తెగా ప్రచారం జరుగుతుంది. లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం.. పెద్ది ఏప్రిల్‌ ౩౦వ తేదీ నుంచి వాయిదా పడి జూన్‌ 5వ తేదీకి వాయిదా పడిందని ఇన్‌సైడ్‌ సినీ సర్కిల్లో టాక్. అయితే ఇప్పటి వరకు దీనిపై అధికారిక ప్రకటన లేదు. మరి దీనిపై మూవీ టీం ఎలా స్పందిస్తుందనేది ఆసక్తిని సంతరించుకుంది.

Also Read: Thaai Kizhavi OTT: ఓటీటీకి లేటెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌ చిత్రం.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News