Buchi Babu Sana: సాధారణంగా సినీ తారలు తమ బర్త్ డేలకి కొత్త సినిమాకి సంబంధించిన ప్రకటనను గానీ, ఆల్రెడీ చేస్తున్న సినిమాలకి సంబంధించిన అప్‌డేట్స్ గానీ ఇచ్చి ఫ్యాన్స్‌ని సర్‌ప్రైజ్ చేస్తుంటారు. ఇక చాలా రేర్‌గా తాము నటిస్తున్న సినిమాల రిలీజ్ డేట్‌ని ప్రకటించడం దాని ప్రకారమే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం చేస్తుంటారు. తాజా సోషల్ మీడియాలో ఓ బిగ్ స్టార్ నటిస్తున్న సినిమాను కూడా ఆయన బర్త్ డే సందర్భంగా అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట..
ఇంతకీ ఆ హీరో ఎవరు..? అంటే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan). రాజమౌళి దర్శకత్వంలో తారక్‌తో కలిసి చేసిన పాన్ ఇండియా సినిమా త్రిపులార్. ఈ సినిమాతో అటు తారక్, ఇటు చరణ్ గ్లోబల్ వైడ్‌గా పాపులారిటీని తెచ్చుకున్నారు. అయితే, ఇద్దరికి ఈ సినిమా తర్వాత ఆశించిన విజయాలు దక్కలేదు. ఎన్‌టిర్ దేవర సినిమా చేశారు. కానీ, అది అంత గ్రాండ్ సక్సెస్ సాధించలేదు. అలాగే, చరణ్ నటించిన ఆచార్య, గేమ్ ఛేంజర్ (Game Changer) సినిమాలు భారీ డిజాస్టర్‌గా నిలిచాయి.
ముఖ్యంగా రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ చరణ్ కెరీర్‌లో ఓ మైల్ స్టోన్ సినిమాగా నిలుస్తుందని అనుకున్నారు. అంతగా అంచనాలు పెంచుకున్నారు. ఆ అంచనాలన్నీ తలకిందులైనాయి. ప్రస్తుతం ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో పెద్ది సినిమాను చేస్తున్నారు. గతంలో సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమాని మించి అదే తరహా నేపథ్యంలో పెద్ది ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే పెద్ది (Peddi) పాత్రలో చరణ్ లుక్స్ వైరల్ అయ్యాయి. ఇక ఫస్ట్ షాట్ గురించైతే చెప్పనవసరం లేదు. భారీ అంచనాలను పెంచేసింది.
జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకి ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే, పెద్ది నుంచి వచ్చిన ఫస్ట్ షాట్ కి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. అయితే, ఈ సినిమాను వచ్చే ఏడాది చరణ్ బర్త్ డే సందర్భంగా 2026 మార్చ్ 27న (Peddi Release Date) పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటి వరకు ఇలా చరణ్ బర్త్ డే (Ram Charan Birthday) కి తన సినిమా రిలీజ్ ప్లాన్ చేయలేదు. ఇదే నిజమైతే పెద్ది మూవీనే మొదటిది అవుతుంది. మరి చరణ్ బర్త్ డే సెంటిమెంట్ పెద్ది మూవీకి ఎంతవరకు కలిసి వస్తుందో చూడాలి.