Wednesday, January 21, 2026
Homeచిత్ర ప్రభRam Charan: త్రివిక్ర‌మ్‌...ప్ర‌శాంత్‌నీల్ కాదు...రామ్ చ‌ర‌ణ్ నెక్స్ట్ మూవీ ఆ ద‌ర్శ‌కుడితోనే!

Ram Charan: త్రివిక్ర‌మ్‌…ప్ర‌శాంత్‌నీల్ కాదు…రామ్ చ‌ర‌ణ్ నెక్స్ట్ మూవీ ఆ ద‌ర్శ‌కుడితోనే!

Ram Charan: ఆర్ఆర్ఆర్ త‌ర్వాత మ‌రో బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ కోసం ఎదురుచూస్తున్నాడు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైన విడుద‌లైన గేమ్ ఛేంజ‌ర్ పెద్ద దెబ్బ కొట్టింది. పొలిటిక‌ల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఈ మూవీ శంక‌ర్‌తో పాటు రామ్‌చ‌ర‌ణ్‌ కెరీర్‌లోనే దారుణ‌మైన డిజాస్ట‌ర్‌గా నిలిచింది.

- Advertisement -

న‌వంబ‌ర్‌లో కంప్లీట్‌…
గేమ్ ఛేంజ‌ర్ త‌ర్వాత ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో పెద్ది మూవీ చేస్తున్నాడు రామ్‌చ‌ర‌ణ్‌. న‌వంబ‌ర్‌లోగా పెద్ది మూవీ షూటింగ్‌ను చ‌ర‌ణ్ కంప్లీట్ చేయ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. పెద్ది షినిష్ అయిన చిన్న పాటి గ్యాప్ మాత్ర‌మే తీసుకొని వెంట‌నే సుకుమార్ మూవీని మొద‌లుపెట్టాల‌ని చ‌ర‌ణ్ ప్లాన్ చేస్తున్న‌ట్లు స‌మాచారం.

Also Read – AP News: దోశ ముక్క గొంతులో ఇరుక్కుపోయి 2 ఏళ్ల బాలుడు మృతి

త్రివిక్ర‌మ్‌…ప్ర‌శాంత్ నీల్‌…
ఆర్ఆర్ఆర్ స‌క్సెస్ త‌ర్వాత‌ చ‌ర‌ణ్‌తో సినిమా చేసేందుకు వివిధ భాష‌ల‌కు చెందిన ప‌లువురు టాప్ డైరెక్ట‌ర్లు ఆస‌క్తిని చూపుతున్నారు. ప్ర‌శాంత్ నీల్‌, త్రివిక్ర‌మ్‌తో పాటు మ‌రికొంద‌రు అగ్ర ద‌ర్శ‌కులు చ‌ర‌ణ్‌కు క‌థ‌లు చెప్పిన‌ట్లు వార్త‌లొచ్చాయి. కానీ రామ్‌చ‌ర‌ణ్ మాత్రం సుకుమార్‌తో సినిమాకే ఆస‌క్తిని చూపుతున్న‌ట్లు తెలిసింది.

గ‌త ఏడాది అనౌన్స్‌…
రంగ‌స్థ‌లం అనంత‌రం రామ్‌చ‌ర‌ణ్‌, సుకుమార్ కాంబోలో తెర‌కెక్క‌నున్న ఆర్‌సీ 17 మూవీని గ‌త ఏడాది అఫీషియ‌ల్‌గా అనౌన్స్‌చేశారు. ఆ త‌ర్వాత ఈ సినిమాకు సంబంధించి నిర్మాణ సంస్థ నుంచి ఎలాంటి అప్‌డేట్ రాలేదు. పుష్ప 2 ప్ర‌మోష‌న్స్‌లో సుకుమార్ సైతం రామ్‌చ‌ర‌ణ్‌తో సినిమా గురించి ఒక్క‌సారి కూడా మాట్లాడ‌లేదు. దాంతో అనౌన్స్‌మెంట్‌తోనే ఈ సినిమా ఆగిపోయిన‌ట్లు వార్త‌లొచ్చాయి. ఈ పుకార్ల‌లో ఎలాంటి నిజం లేద‌ని స‌మాచారం.

రా అండ్ రిస్టిక్‌…
ఆర్‌సీ 17 కోసం సుకుమార్ త‌న స్టైల్‌ను మార్చిన‌ట్లు తెలిసింది. సుక్కు గ‌త సినిమాలు రంగ‌స్థ‌లం, పుష్ప‌, పుష్ప 2 రా అండ్ ర‌స్టిక్ కాన్సెప్ట్‌ల‌తో తెరకెక్కాయి. వాటికి భిన్నంగా సిటీ బ్యాక్‌డ్రాప్‌లో రొమాంటిక్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రామ్ చ‌ర‌ణ్ మూవీని రూపొందించ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇందులో చ‌ర‌ణ్ రోల్ చాలా స్టైలిష్‌గా ఉంటుంద‌ని అంటున్నారు. రామ్‌చ‌ర‌ణ్ సినిమా కోసం స్క్రిప్ట్‌ను సుకుమార్ లాక్ చేశాడ‌ట‌. త్వ‌ర‌లోనే చ‌ర‌ణ్‌ను క‌లిసి ఫుల్ న‌రేష‌న్‌ను ఇవ్వ‌బోతున్న‌ట్లు చెబుతున్నారు. ఈ ఏడాది డిసెంబ‌ర్‌లో రామ్‌చ‌ర‌ణ్, సుకుమార్ మూవీ సెట్స్‌పైకి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేక‌ర్స్‌తో క‌లిసి స్వీయ నిర్మాణ సంస్థ సుకుమార్ రైటింగ్స్‌పై ప‌తాకంపై డైరెక్ట‌ర్ సుకుమార్ నిర్మించ‌బోతున్నాడు. దేవిశ్రీప్ర‌సాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

Also Read – Sai dharam tej movie: ఫ్లాప్ డైరెక్టర్ తో మెగా హీరో.. ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ!

జాన్వీ క‌పూర్ హీరోయిన్‌…
కాగా రామ్‌చ‌ర‌ణ్ పెద్ది మూవీ షూటింగ్ దాదాపు తుది ద‌శ‌కు చేరుకున్న‌ట్లు స‌మాచారం. రూర‌ల్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతోన్న ఈ మూవీలో జాన్వీ క‌పూర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. క‌న్న‌డ అగ్ర హీరో శివ‌రాజ్ కుమార్ ఓ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాకు ఆస్కార్ విన్న‌ర్ ఏఆర్ రెహ‌మాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News