Thursday, March 12, 2026
Homeచిత్ర ప్రభRam charan: కొణిదెల శివరామ్‌..కొణిదెల అన్వీరా దేవి గా మీ ముందుకు

Ram charan: కొణిదెల శివరామ్‌..కొణిదెల అన్వీరా దేవి గా మీ ముందుకు

Mega family- Twin babies: మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌,ఉపాసన దంపతులు ఇటీవల కవల పిల్లలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. జనవరి 31న ఉపాసన ఒక మగ బిడ్డకు, ఒక ఆడ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ శుభవార్త బయటకు వచ్చిన వెంటనే మెగా కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. అభిమానులు కూడా ఈ సందర్భాన్ని ఘనంగా జరుపుకున్నారు.

- Advertisement -

కవల పిల్లలను ప్రసవించిన వెంటనే..

జనవరి 31న ఉపాసన కవల పిల్లలను ప్రసవించిన వెంటనే అభిమానులు పెద్ద సంఖ్యలో జూబ్లీహిల్స్‌లోని అపోలో హాస్సిటల్‌ వద్దకు చేరుకున్నారు. రామ్ చరణ్,ఉపాసన దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతూ సందడి సందడి చేశారు. సోషల్ మీడియాలో కూడా అభినందనల సందేశాలు వెల్లువెత్తాయి.

Also Read:https://teluguprabha.net/cinema-news/will-rukmini-vasanth-also-make-the-same-mistake-as-rashmika-mandanna/

సంప్రదాయ పద్ధతిలో నామకరణ వేడుక ..

ప్రసవానంతరం కొద్ది రోజుల చికిత్స అనంతరం ఉపాసన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆమె తన కవల పిల్లలను ఇంటికి తీసుకువచ్చారు. కుటుంబ సభ్యుల సమక్షంలో సంప్రదాయ పద్ధతిలో నామకరణ వేడుక నిర్వహించినట్లు సినీ వర్గాలు తెలియజేశాయి. ఈ కార్యక్రమాన్ని పండితుల సూచనలు, శుభ ముహూర్తాలను అనుసరించి నిర్వహించినట్లు సమాచారం.

కుటుంబ సభ్యులు, బంధువులు మాత్రమే…

ఈ వేడుకకు అత్యంత సన్నిహిత కుటుంబ సభ్యులు, బంధువులు మాత్రమే హాజరైనట్లు తెలుస్తోంది. వేడుకకు సంబంధించిన వివరాలు బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో పిల్లల పేర్లపై చర్చ మొదలైంది. సినీ వర్గాల సమాచారం ప్రకారం, కూతురికి అన్వీరా దేవి అనే పేరు, కుమారుడికి శివ్‌ రామ్‌ అనే పేరు నిర్ణయించినట్లు తెలిసింది.

ధైర్యవంతురాలైన దేవి…

అన్వీరా దేవి అనే పేరుకు ధైర్యవంతురాలైన దేవి అనే అర్థం ఉన్నట్లు చెబుతున్నారు. కుమారుడికి పెట్టిన శివ్రామ్ అనే పేరు కుటుంబానికి ప్రత్యేకమైన భావాన్ని కలిగించేలా ఉందని సమాచారం. ఈ పేరులో మెగా స్టార్ చిరంజీవి అసలు పేరులోని శివ అనే పేరుని, అలాగే రామ్ చరణ్ పేరులోని రామ్ అనే భాగాన్ని కలిపి రూపొందించినట్లు తెలుస్తోంది.

Also Read: https://teluguprabha.net/cinema-news/sreeleela-is-now-officially-doctor-completed-her-mbbs-degree/

జనవరి 31న ఉపాసన కవలలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ పేర్లు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం పొందుతున్నాయి. మెగా కుటుంబంలో కొత్త తరానికి స్వాగతం పలికిన ఈ సందర్భం అభిమానుల్లో ఆనందాన్ని మరింత పెంచుతోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News