గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) హీరోగా నటించిన ‘గేమ్ ఛేంజర్’(Game Changer) ప్రీరిలీజ్ ఈవెంట్ రాజమండ్రిలో జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఫంక్షన్‌కు వచ్చి తిరిగి వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. రాజమండ్రి సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో అరవపల్లి మణికంఠ, తోకాడ చరణ్ అనే ఇద్దరు యువకులు మరణించారు. కాకినాడకు చెందిన వీరిద్దరు ప్రీరిలీజ్ ఈవెంట్‌కు హాజరయ్యారు.
ఫంక్షన్ ముగిసిన అనంతరం కాకినాడ వైపు వస్తుండగా కార్గిల్ ఫ్యాక్టరీ వద్ద వ్యాను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరికి బలమైన గాయాలయ్యాయి. మణికంఠ అక్కడికక్కడే చనిపోగా.. చరణ్‌ను కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలిస్తున్న క్రమంలో మార్గమధ్యలో మృతి చెందాడు. దీంతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ క్రమంలో వాళ్ల కుటుంబసభ్యులకు నిర్మాత దిల్ రాజు(Dil Raju) రూ.5లక్షలు సాయం ప్రకటించారు.