రాం గోపాల్ వర్మ్ సినిమా ప్రమోషన్స్ ఏ రేంజ్ లో ఉంటుందో మనందరికీ తెలిసిన విషయమే. ఈసారి ‘వ్యూహం’ సినిమా కోసం ఆయన సరికొత్త వ్యూహం పన్ని భలే రెచ్చగొడుతున్నారే. అయిపోయిందని ఆయన చేసిన ట్వీట్ భలే పేలింది. అప్పుడే నెట్టింట రచ్చ స్టార్ట్ అయిపోయింది కూడా. మొత్తానికి తన సినిమాకు తనే స్టార్ క్యాంపెయినర్ లా వర్మ ప్రచారంలో రెచ్చిపోయే తీరు మాత్రం సూపర్బ్. ఈ వ్యూహానికి మాత్రం ఎదురుండదు అని ఎవరైనా నమ్మాల్సిందే. దటీజ్ వర్మ.
”కుట్రలకీ ఆలోచనలకీ మధ్య” (Tag line) అంటూ సరిగ్గా ఎలక్షన్స్ టైంలో పొలిటికల్ సినిమా హీట్ రాజేసిన వర్మ ఆ మంటలో చలి కాచుకుంటున్నారు. జగన్ ను హీరోగా చూపిస్తూ సినిమా తీసినట్టు, మరోమారు చంద్రబాబును చౌరస్తాలో నిలిపేలా కథనం ఉంటుందని ట్రేలర్స్ చూస్తుంటే ఇట్టే అర్థమవుతుండగా తొలిసారి భారతి పాత్రను మెయిన్ స్ట్రీమ్ లో చూపెట్టనుండటం కొత్తదనం. ఎప్పుడూ లో ప్రొఫైల్ లో ఉండే జగన్ సతీమణి భారతి పాత్ర ఈ సినిమాలో హైలైట్ కానుందనే హింట్ ఇప్పటికే వర్మ ఇచ్చారు కూడా.