Saturday, January 4, 2025
Homeచిత్ర ప్రభRGV: షాకింగ్ డెసిషన్ తీసుకున్న రామ్ గోపాల్ వర్మ

RGV: షాకింగ్ డెసిషన్ తీసుకున్న రామ్ గోపాల్ వర్మ

2024 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ 2025 సంవత్సరానికి ప్రపంచమంతా ఘన స్వాగతం పలికింది. ఈ నేపథ్యంలో చాలా మంది న్యూఇయర్ రిజల్యూషన్ అంటూ కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇదే కోవలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma)న్యూ ఇయర్ కానుకగా కొత్త నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాలు ఏంటో ఎక్స వేదికగా పోస్ట్ చేసి అందరికీ షాక్ ఇచ్చారు.

- Advertisement -

ఆర్జీవీ తీసుకున్న 7 తీర్మానాలు ఇవే..

  1. ఇక నుండి వివాదరహితుడిగా ఉండాలని నిర్ణయించుకున్నాను
  2. మంచి ఫ్యామిలీ మ్యాన్ లా ఉండాలని భావిస్తున్నాను
  3. దేవుడి పట్ల భయం, భక్తి కలిగి ఉంటాను
  4. ప్రతి ఏడాది 10 ‘సత్య’ లాంటి సినిమాలు తెస్తాను
  5. ఎవరిపై నెగిటివ్ ట్వీట్స్ వేయను
  6. ఆడవారిని అసలు చూడను
  7. వోడ్కా తాగడం మానేస్తాను

ఇవన్నీ తూచా తప్పకుండ పాటిస్తానని ‘నా మీద తప్ప మీ అందరి మీద ఓటేస్తున్నాను’ అని తెలిపారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో చెప్పింది ఏదీ ఆర్జీవీ చేయరు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News