Wednesday, April 2, 2025
Homeచిత్ర ప్రభRama jogayya sastry : నన్ను గౌరవంగా చూసే వాళ్లే నాతో ఉండండి..

Rama jogayya sastry : నన్ను గౌరవంగా చూసే వాళ్లే నాతో ఉండండి..

- Advertisement -

Rama jogayya sastry : తెలుగు సినీ పరిశ్రమలో మంచిగా తెలుగు పాటలు రాసేవాళ్ళు చాలా తక్కువమంది ఉన్నారు. సీనియర్స్ అయితే వేళ్ళ మీద లెక్కపెట్టొచ్చు. అలాంటి వారిలో రామజోగయ్య శాస్త్రి ఒకరు. ఈయన అన్ని పాటలు రాయగలరు. తాజాగా బాలకృష్ణ వీరసింహ రెడ్డి సినిమా నుంచి వచ్చిన జై బాలయ్య పాటని రాశారు.

ఈ పాటకి మంచి రెస్పాన్స్ వస్తుంది. అయితే కొంతమంది మాత్రం పాటలోని లిరిక్స్ బాగోలేవంటూ, సింపుల్ గా ఉన్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే రామజోగయ్య శాస్త్రి పేరు ముందు సరస్వతి పుత్ర అని వేసుకున్నారు. దీంతో ఆ బిరుదు ఎవరిచ్చారు అంటూ కూడా కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.

దీనికి సమాధానంగా రామజోగయ్య శాస్త్రి తన ట్విట్టర్లో సీరియస్ గానే సమాధానమిచ్చారు. దీనిపై స్పందిస్తూ.. ”నేను ప్రతి పాట ప్రాణం పెట్టి మమకారంతో రాస్తాను. దయచేసి నన్ను గౌరవంగా చూడగలిగిన వారు మాత్రమే నాతో ప్రయాణించగలరు. అన్నట్టు జన్మనిచ్చిన అమ్మగారి గౌరవార్ధం నా పేరును సరస్వతీపుత్ర రామజోగయ్యశాస్త్రిగా మార్చుకున్నాను. ఇందులో ఎవరికీ ఏమి ఇబ్బంది ఉండవలసిన అవసరం లేదు. ఉంటే ఇటు రాకండి” అంటూ కౌంటర్ ఇచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News