Sunday, July 13, 2025
Homeచిత్ర ప్రభRamayana Glipse: రణబీర్ రాముడిగా, యష్ రావణుడిగా...‘రామాయణ’ గ్లింప్స్ చూసినవాళ్లంతా షాక్!

Ramayana Glipse: రణబీర్ రాముడిగా, యష్ రావణుడిగా…‘రామాయణ’ గ్లింప్స్ చూసినవాళ్లంతా షాక్!

Ranbir Kapoor – Yash – Sai Pallavi: ఇండియన్ సినిమా చరిత్రలో మరో భారీ ప్రాజెక్ట్ రాబోతోంది.. అదే అది నితేష్ తివారి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘రామాయణ’. ఈ భారీ బ‌డ్జెట్ మూవీని న‌మిత్ మ‌ల్హోత్రా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నా, తాజాగా 3 నిమిషాల అనౌన్స్‌మెంట్ వీడియో, 7 నిమిషాల విజన్ షోరీల్ ప్రివ్యూ చూసినవాళ్లు తెగ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఈ వీడియో చూసిన వాళ్ల మాటల్లో చెప్పాలంటే… గూజ్ బంప్స్ ప‌క్కా. శ్రీరాముడి పాత్ర‌లో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ లుక్‌లో చూపించిన ఇంటెన్సిటీ, సాయి పల్లవి సీతగా కనిపించిన సానుభూతి, యష్ చేసిన రావణుడి పాత్రలో కనిపించిన వైల్డ్ లుక్‌ అన్నీ చూపరులను ఆకట్టుకుంటాయి. సన్నీ డియోల్ హనుమంతుడిగా న‌టిస్తున్నారు. ఇక AR రెహ్మాన్, హాన్స్ జిమ్మర్ కలయికలో అందిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఒక విజువల్ ఎక్స్‌పీరియన్స్‌కి మ్యూజికల్ మేజిక్‌ను కలిపినట్టు ఉంది.

- Advertisement -

నమిత్ మల్హోత్రా వంటి విజనరీ ప్రొడ్యూసర్ అండగా ఉండటంతో, ఈ ప్రాజెక్ట్ ఒక అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకుంటోంది. రామ్ కథను ఆధారంగా తీసుకొని, ఒక గ్లోబల్ స్టాండర్డ్ సీనిమాటిక్ యూనివర్స్‌ను క్రియేట్ చేయాలన్న లక్ష్యంతో నితేష్ తివారి పనిచేస్తున్నారు. ఈ షో రీల్, సినిమా వెనుక ఉన్న ప్రివిజ్, గ్రాఫిక్స్, డిజైన్, క్యారెక్టర్ డెవలప్‌మెంట్ వంటివి చూపిస్తుంది. రామాయ‌ణ మొద‌టి భాగాన్ని 2026 దీపావ‌ళికి విడుద‌ల చేస్తున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ఈ ఫుటేజ్ చూసినవాళ్లంతా రణబీర్ రామ్ పాత్రలో ప‌క్కాగా స‌రిపోయాడ‌ని అంటున్నారు. ఇక య‌ష్ మాత్రం రావ‌ణుడి గెట‌ప్‌లో నెక్ట్స్ రేంజ్ పెర్ఫామెన్స్ ఇవ్వ‌బోతున్నార‌నేది స్ప‌ష్ట‌మైంది.

ALSO READhttps://teluguprabha.net/cinema-news/bollywood-beauty-deepika-padukone-has-been-selected-for-a-hollywood-walk-of-fame-star-in-2026/

రామాయణ గ్లింప్స్‌లో త్రిమూర్తుల గురించి చెప్తూ, ‘ముల్లోకాలపై ఆధిపత్యం కోసం ఎదురు తిరిగినప్పుడు అన్ని యుద్ధాలను అంతం చేసే యుద్ధం ప్రారంభమైంది’ అంటూ హైప్ క్రియేట్ చేశారు. ఇది కేవలం కథ కాదు, ‘మన వాస్తవం.. మన చరిత్ర’ అంటూ సినిమాపై అంచనాలు పెంచారు. లక్ష్మణుడిగా రవి దుబే, హనుమంతుడిగా సన్నీ దేఓల్‌ లాంటి స్టార్స్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. 5వేల సంవత్సరాల నుంచి 2500 కోట్ల మంది ప్రజలు ఆరాధించే ఈ అమర ఇతిహాసగాథ బిగ్ స్క్రీన్‌పై గేమ్ ఛేంజర్ అవ్వడం ఖాయం

రామాయ‌ణ చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు. అందులో తొలి భాగం వ‌చ్చే ఏడాది దీపావళికి వ‌స్తుంటే రెండో భాగం 2027 దీపావ‌ళికి రానుంది. రామాయ‌ణ పార్ట్ వ‌న్ షూటింగ్ పూర్త‌య్యింది. రెండో భాగం షూటింగ్ ఆగ‌స్ట్‌లో ప్రారంభం కానుంది. విజువ‌ల్ వండ‌ర్‌గా హాలీవుడ్ స్థాయిలో బడ్జెట్‌తో, టెక్నికల్ గా అత్యున్నతంగా తెరకెక్కుతోన్న ఈ సినిమా… భారత సినిమా స్థాయిని ప్రపంచానికి చూపించబోతోందన‌టంలో ఎలాంటి సందేహం లేద‌ని త్రీడీలో రామాయ‌ణ పార్ట్ వ‌న్ గ్లింప్స్ చూసిన వాళ్లు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News