Ramayana: శ్రీరామనవమి సందర్భంగా ‘రామాయణ’ టీం అదిరిపోయేలా ప్లానింగ్స్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ‘రామాయణ’ నుంచి సరైన అప్డేట్లు ఏవీ రివీల్ చేయలేదు. ఇక ఒక్క గ్లింప్స్‌తో అంచనాల్ని తారాస్థాయికి పెంచేశారు. అయితే ఇప్పుడు శ్రీరామనవమి రాబోతోంది. ఈ క్రమంలో రామాయణ టీం ఈ పండుగకు అదిరిపోయేలా అప్డేట్లు ఇవ్వాలని ప్లాన్ చేసింది. అంతే కాకుండా దేశం మొత్తం చూసేలా ఓ గ్రాండ్ ఈవెంట్‌ని కూడా ప్లాన్ చేస్తుందట. ముంబైలో గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద భారీ కార్యక్రమాన్ని నిర్వహించాలని టీం అనుకుంటోందట.
రామాయణ నుంచి ఇప్పటి వరకు చాలానే లీక్స్ వచ్చాయి. మరీ ముఖ్యంగా ఈ మూవీ బడ్జెట్ గురించి అందరూ తలా ఒకటి మాట్లాడుకుంటున్నారు. వేల కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీని తీస్తున్నారని అంటున్నారు. అసలు సిసలు ఇండియన్ సినిమాని, భారతీయ గొప్ప దనాన్ని చాటే చిత్రం ఇదే అవుతుందని అంతా అనుకుంటున్నారు. మొదటి పార్ట్ ఈ దీపావళికి వస్తుండగా.. రెండో పార్ట్ వచ్చే ఏడాది దీపావళికి రానున్నట్టుగా ఇది వరకే ప్రకటించిన సంగతి తెలిసిందే.
Also Read – Sharwanand: మరో సినిమాను ఫిక్స్ చేసిన శర్వానంద్..‘బైకర్’ కొత్త రిలీజ్ డేట్!
నమిత్ మల్మోత్రతో కలిసి యశ్ కూడా ఈ మూవీ నిర్మాణంలో పాలు పంచుకున్నాడు. ఇక నితీష్ తివారి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రణ్ బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్ రావణుడిగా కనిపించబోతోన్న సంగతి తెలిసిందే. ఇక ఈ మూడు పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లను కూడా శ్రీరామనవమి సందర్భంగా రిలీజ్ చేయబోతోన్నారట. ఈ మేరకు టీం ఆయా పనుల్లో బిజీగా ఉందట.
ఇక ఫ్యాన్స్ అంతా కూడా మార్చి 27న జరిగే రామనవమి వేడుకల కోసం ఎదురుచూస్తున్నారు. రామాయణ మూవీని అంతర్జాతీయ భాషల్లోనూ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అసలు సిసలు పాన్ వరల్డ్ మూవీగా రామాయణ ప్రపంచస్థాయి ఆడియెన్స్‌ను మెప్పించేలా ఉండబోతోంది. ఈ చిత్రంతో రణ్ బీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ పేర్లు వరల్డ్ వైడ్‌గా మార్మోగిపోయేలా ఉన్నాయి. ఇక ఈ మూవీ తరువాత మళ్లీ ఓం రౌత్‌ను ఆడియెన్స్ ట్రోల్స్ చేసే అవకాశం ఉందన్న సంగతి తెలిసిందే.
Also Read – Naga Vamsi: దిల్‌రాజుకి షాకిచ్చిన నాగవంశీ?

