Tuesday, December 9, 2025
Homeచిత్ర ప్రభHighest Budget Movie: ఇండియాలోనే హ‌య్యెస్ట్ బ‌డ్జెట్ సినిమాలు ఇవే - టాప్ త్రీలో మ‌హేష్‌బాబు,...

Highest Budget Movie: ఇండియాలోనే హ‌య్యెస్ట్ బ‌డ్జెట్ సినిమాలు ఇవే – టాప్ త్రీలో మ‌హేష్‌బాబు, బ‌న్నీ మూవీస్‌!

Highest Budget Movie: ఇదివ‌ర‌కు ఓ ఇండియ‌న్ సినిమా బ‌డ్జెట్ వంద కోట్లు దాటితే గొప్ప‌గా చెప్పుకునేవారు. వంద కోట్లు అంటే బ‌డ్జెట్ ప‌రంగా రిస్క్ చేస్తున్నార‌నే కామెంట్స్ వినిపించేవేవి. కానీ ఇప్పుడు ఐదు వంద‌లు, వెయ్యి కోట్ల బ‌డ్జెట్ కూడా కామ‌న్‌గా మారిపోయింది. పాన్ ఇండియ‌న్ క‌ల్చ‌ర్‌తో బ‌డ్జెట్ విష‌యంలో నిర్మాత‌లు ఏ మాత్రం కాంప్ర‌మైజ్ కావ‌డం లేదు. ఎంత ఖ‌ర్చు అయినా పెట్ట‌డానికి రెడీ అంటున్నారు. ప్ర‌స్తుతం సెట్స్‌పై ఉన్న ఓ మూడు భారీ సినిమాల బ‌డ్జెట్ అటు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌తో పాటు ఇటు ఫ్యాన్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. బ‌డ్జెట్ ప‌రంగా ఇండియాలోనే కాస్ట్‌లీయెస్ట్ మూవీస్‌గా ఈ స్టార్ హీరోల సినిమాలు తెర‌కెక్కుతున్నాయి. ఈ మూడు సినిమాల్లో రెండు తెలుగు హీరోల‌వే కావ‌డం గ‌మ‌నార్హం.

- Advertisement -

రామాయ‌ణ‌..
ర‌ణ‌భీర్‌క‌పూర్, య‌శ్ హీరోలుగా న‌టిస్తున్న‌ రామాయ‌ణ… ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలోనే హ‌య్యెస్ట్ బ‌డ్జెట్ మూవీగా తెర‌కెక్కుతోంది. నాలుగు వేల కోట్ల‌తో ఈ మైథ‌లాజిక‌ల్ మూవీని తెర‌కెక్కిస్తున్నారు మేక‌ర్స్‌. రామాయ‌ణ గాథ ఆధారంగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో ర‌ణ‌భీర్‌క‌పూర్ రాముడిగా న‌టిస్తుండ‌గా… య‌శ్ రావ‌ణుడి పాత్ర పోషిస్తున్నారు. సీత పాత్ర‌లో సాయిప‌ల్ల‌వి న‌టిస్తోంది. రామాయ‌ణ మూవీ రెండు భాగాలుగా తెర‌కెక్కుతోంది. ఫ‌స్ట్ పార్ట్ 2026 న‌వంబ‌ర్‌లో రిలీజ్ కాబోతుండ‌గా… సెకండ్ పార్ట్ 2027లో విడుద‌ల చేయ‌బోతున్నారు. రామాయ‌ణ మూవీకి నితీష్ తివారి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

Also Read – Balakrishna: బాలకృష్ణ మాటలకి బాలీవుడ్ షేక్ అవుతుందా..!

అల్లు అర్జున్ – అట్లీ మూవీ…
పుష్ప 2 బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత కోలీవుడ్ డైరెక్ట‌ర్ అట్లీతో సినిమా చేస్తున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. 1500 కోట్ల బ‌డ్జెట్‌తో హాలీవుడ్ లెవెల్‌లో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాలోని గ్రాఫిక్స్‌, వీఎఫ్ఎక్స్ కోస‌మే మేక‌ర్స్‌ 500 కోట్ల‌కుపైగా ఖ‌ర్చు చేస్తున్న‌ట్లు స‌మాచారం. అల్లు అర్జున్‌, అట్లీ సినిమాకు టాప్ మోస్ట్ హాలీవుడ్ టెక్నీషియ‌న్లు ప‌నిచేస్తున్నారు. ఇందులో దీపికా ప‌దుకొనె, మృణాల్ ఠాకూర్‌తో పాటు జాన్వీక‌పూర్‌, ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఈ సినిమాను స‌న్ పిక్చ‌ర్స్ సంస్థ నిర్మిస్తోంది.

మ‌హేష్‌బాబు వార‌ణాసి..
సూప‌ర్ స్టార్ మ‌హేష్‌బాబు లేటెస్ట్ మూవీ వార‌ణాసి క్రేజ్ పాన్ ఇండియా దాటిపోయింది. వ‌న్ వ‌ర‌ల్డ్ మూవీగా రాజ‌మౌళి ఈ సినిమాను రూపొందిస్తున్నారు. దాదాపు 1300 కోట్ల బ‌డ్జెట్‌తో ఇండియాలోనే అత్య‌ధిక వ్య‌యంతో తెర‌కెక్కుతోన్న సినిమాల్లో ఒక‌టిగా వార‌ణాసి ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. మైథాల‌జీ, టైమ్ ట్రావెల్ అంశాల‌తో యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో గ్లోబ‌ల్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా న‌టిస్తోంది. మ‌ల‌యాళ అగ్ర న‌టుడు పృథ్వీరాజ్ సుకుమార‌న్ విల‌న్‌గా న‌టిస్తున్నాడు. వార‌ణాసి మూవీ 2027 మార్చిలో రిలీజ్ కానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ సినిమాను కేఎల్ నారాయ‌ణ నిర్మిస్తున్నారు.

Also Read – Hyper Aadi: రాజమౌళిగారు హనుమంతుడిపై అలిగారే తప్ప అవమానించలేదు..జక్కన్నకి హైపర్ ఆది సపోర్ట్

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News