Saturday, November 23, 2024
Homeచిత్ర ప్రభRamayanam TV serial: రామాయణం సీరియల్

Ramayanam TV serial: రామాయణం సీరియల్

కంటెస్ట్ కూడా..

జెమిని టివిలో మే 27వ తేదీ సోమవారం సా. 6.30 లకు అద్భుత దృశ్యకావ్యం శ్రీమద్ రామాయణం సీరియల్ ప్రసారం ప్రారంభం కానుంది. మానవ సమాజానికి ఆదర్శవంతమైన విలువలను చాటి చెప్పిన శ్రీ మహా విష్ణువు అవతార గాథే ” శ్రీ మధ్ రామాయణం”. తండ్రి మాట జవదాటని కొడుకుగా, అన్నగా, ఏకపత్నీవ్రతుడిగా,స్నేహితుడిగా, ప్రజల క్షేమం కోసం ధర్మం తప్పని రాజుగా, అందరికి ఆదర్శంగా నిలిచిన శ్రీరామగాథను ఎన్ని సార్లు చూసినా తనివి తీరదు.

- Advertisement -

ఈ శ్రీమద్ రామాయణం సీరియల్ లో.. శ్రీ రాముని అవతార విశిష్టత , జన్మ వృత్తాంతం,… లంకాధిపతి అయిన రావణాసురుడి జన్మ వృత్తాంతం మొదలుకుని రామాయణంలోని అన్ని ఘట్టాలను కనులకు కట్టినట్లుగా అద్భుతమైన సాంకేతిక విలువలతో అత్యద్భుతంగా చిత్రీకరించి శ్రీ రామ గాథను జెమిని టివి అభిమాన ప్రేక్షకులందరికి ఎప్పటికి గుర్తుంది పోయేలా అందించనున్నారు.

శ్రీ వాల్మీకి విరచిత రామాయణం ” శ్రీమద్ రామాయణం”గా సూపర్ గ్రాఫిక్ టెక్నాలజీతో, అనుభవజ్ఞులైన నటీనటుల పెరఫార్మెన్సు తో, మనుసుని ఆకట్టుకునే డైలాగ్స్ తో , ప్రతి తెలుగు ప్రేక్షకుడిని అలరించడానికి మే 27 వ తేదినుండి. సోమవారం నుండి శనివారం వరకు, ప్రతి రోజు సాయంత్రం 6 గంటల 30 నిమిషాలనుండి 7 గంట 30 నిమిషాల వరకు ప్రసారం కానుంది.

శ్రీమద్ రామాయణం సీరియల్ ప్రారంభ సందర్భంగా జెమిని టివి, “జెమినిలో కాసుల వర్షం” అనే కాంటెస్ట్”ని నిర్వహిస్తోంది. మే 27 నుండి జూన్ 1 వరకు ప్రసారమయ్యే శ్రీమద్ రామాయణం సీరియల్ ఎపిసోడ్స్ లో ఆరు రోజులపాటు అడిగే ప్రశ్నలకు ప్రేక్షకులు మిస్డ్ కాల్ ద్వార సమాధానాలను తెలియజేసి 1000 రూపాయిల నగదు బహుమతిని పొందే అవకాశం ఈ కాంటెస్ట్ ద్వారా లభిస్తుంది. ప్రతి రోజు 500 మంది లక్కీ విజేతలని ఎన్నుకుంటారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News