Thursday, November 21, 2024
Homeఆంధ్రప్రదేశ్RGV: రామ్‌గోపాల్ వర్మ బెయిల్ పిటిషన్.. విచారణ వాయిదా

RGV: రామ్‌గోపాల్ వర్మ బెయిల్ పిటిషన్.. విచారణ వాయిదా

తనపై ఒంగోలు పోలీసులు నమోదు చేసిన కేసులో అరెస్ట్ కాకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ(Ramgopal Varma) ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం తదుపరి విచారణను ఈనెల 26కు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.

- Advertisement -

తనపై మద్దిపాడు పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ ఆర్జీవీ చేసిన అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. దీంతో అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలంటూ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.

కాగా సార్వత్రిక ఎన్నికల ముందు ఆర్జీవీ రూపొందిచిన ‘వ్యూహం’ సినిమా ప్రమోషనల్లో భాగంగా చంద్రబాబు, లోకేష్‌, పవన్ కళ్యాణ్‌పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో విచారణకు హాజరుకావాలంటూ ఆర్జీవీకి పోలీసులు ఈ నెల 19వ తేదీన విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చారు. అయితే షూటింగ్‌లో బిజీగా ఉన్నానంటూ నాలుగు రోజులు గడువు కోరారు వర్మ. దీంతో ఈనెల 25వ తేదీన ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్‌లో విచారణకి హాజరుకావాలని మరోసారి నోటీసులు పంపించారు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News