Homeచిత్ర ప్రభRamya krishnan: రమ్యకృష్ణ, రాజశేఖర్ సినిమాకి అంతవసరమా..?

Ramya krishnan: రమ్యకృష్ణ, రాజశేఖర్ సినిమాకి అంతవసరమా..?

Ramya krishnan: డా.రాజశేఖర్.. ఒకప్పుడు తెలుగులో యాంగ్రీ మేన్ గా నటించిన అంకుశం, సింహరాశి, మనసున్న మారాజు, ఆయుధం, శేషు, ఎవడైతే నాకేంటి లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ కమర్షియల్ సక్సెస్‌లను సాధించాయి. అయితే, గత కొంతకాలంగా రాజశేఖర్ నుంచి హీరోగా ఏ సినిమా రాలేదు. దాదాపు ఈ యాంగ్రీ హీరో సినిమాలకి దూరం అయ్యారనే మాట వినిపించింది. అదే సమయంలో తన కూతుర్లని హీరోయిన్స్‌గా నిలబెట్టే ప్రయత్నాలలో ఉన్నారని ప్రచారం జరిగింది.

- Advertisement -

అయితే, నితిన్ హీరోగా నటించిన ఎక్స్ట్రార్డినరీ మేన్ సినిమాలో ఓ కీలక పాత్రను పోషించారు. ఈ పాత్ర రాజశేఖర్ కి మంచి పేరునే తెచ్చిపెట్టింది. దాంతో రాజశేఖర్ కి పేరొచ్చే పాత్ర ఏదైనా అవకాశం వస్తే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి రెడీగా ఉన్నట్టు మాట్లాడుకుంటున్నారు. జగపతిబాబు లాంటి సీనియర్ హీరోలు సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్ పాత్రల్లో నటించి బాగా క్రేజ్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. జగ్గుభాయ్ ప్రస్తుతం ఎన్నో విభిన్నమైన పాత్రలతో అలరిస్తున్నారు. అలాగే, రాజశేఖర్ కూడా తన కెరీర్ ని ప్లాన్ చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.

Also Read – Bheems Ceciroleo: పార్కులో తిరిగా.. ఫుట్‌పాత్ మీద పడుకున్నా.. కన్నీళ్ళతో భీమ్స్

ఇదిలా ఉంటే, సీనియర్ నటి రమ్యకృష్ణ, రాజశేఖర్ కలిసి ఓ సినిమా చేయబోతున్నట్టుగా లేటెస్ట్ న్యూస్. తమిళంలో వచ్చి సూపర్ హిట్ అయిన లబ్బర్ పండు అనే సినిమా తెలుగు రీమేక్ లో వీరిద్దరు కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారట. వీరి కాంబోలో వచ్చిన అల్లరి మొగుడు లాంటి సినిమాలు ఎంతటి ఘన విజయాన్ని అందుకున్నాయో తెలిసిందే. మళ్ళీ, ఈ కాంబోను చూడబోతున్నామనే మాట బలంగా వినిపిస్తోంది. ఇందులో రాజశేఖర్ కూతురు శివాత్మిక కూడా నటించబోతుందట.

అయితే, దీనికి సంబందించి ఓ నెగిటివ్ టాక్ కూడా వినిపిస్తోంది. లబ్బర్ పండు సినిమాను ఓటీటీలో మన తెలుగు ఆడియన్స్ దాదాపు చూసేశారు. మళ్ళీ ఇలాంటి సినిమాను చూసేందుకు థియేటర్స్ కి ఎందుకు వస్తారు అని. నిజమే, అసలు రీమేక్ సినిమాలకి దాదాపుగా కాలం చెల్లిపోయిన నేపథ్యంలో ఆల్రెడీ ఓటీటీలో కూడా ఉన్న సినిమాను మళ్ళీ తీస్తే చూసేందుకు జనం థియేటర్స్ కి ఎందుకు వస్తారు? చూడాలి మరి ఈ వార్తల్లో నిజమెంత ఉందనేది. ఒకవేళ నిజంగా రీమేక్ చేసినా కథలో చాలా మార్పులు చేయాల్సి ఉంటుంది.

Also read – NBK111: మీసాల పిల్ల బాలయ్య సినిమాలోకి ఎంట్రీ!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News