Thursday, January 30, 2025
Homeఆంధ్రప్రదేశ్Rana: విషాదం.. పాడె మోసిన హీరో రానా

Rana: విషాదం.. పాడె మోసిన హీరో రానా

సినీ న‌టుడు దగ్గుబాటి రానా(Rana) కుటుంబంలో విషాదం నెల‌కొంది. ప్రముఖ పారిశ్రామికవేత్త యలమర్తి నారాయణరావు చౌదరి భార్య, దివంగత ఎమ్మెల్యే వైటీ రాజా తల్లి రాజేశ్వరి దేవి క‌న్నుమూశారు. గ‌త‌ కొంత‌కాలంగా ఆమె అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. ఈమె నిర్మాత సురేశ్‌ బాబుకు పిల్లనిచ్చిన అత్త, హీరో రానాకు అమ్మమ్మ అవుతారు. బుధ‌వారం సొంతూరు త‌ణుకులో నిర్వ‌హించిన అంత్యక్రియలో రానా కుటుంబం పాల్గొంది. ఈ సందర్భంగా రానా అమ్మమ్మ పాడె మోశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

- Advertisement -

ఇక రానా కెరీర్ విష‌యానికొస్తే.. తెలుగులోనే కాకుండా త‌మిళ‌, హిందీ భాష‌ల్లో న‌టిస్తూ ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్నారు. సినిమాల్లో కాకుండా వెబ్ సిరీసులు, టాక్‌షోలతో బిజీబిజీగా గడిపేస్తున్నారు. త్వరలోనే భారీ బడ్జెట్ సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నాడు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News