Rashmika: బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా పేరుతెచ్చుకున్న దక్షిణాది నాయికలు చాలా తక్కువ మంది ఉన్నారు. ఈ జాబితాలో ఒకరిగా రష్మిక మందన్న నిలిచింది. తెలుగులో పుష్ప 2 (Pushpa 2), కుబేర (Kubera), బాలీవుడ్‌లో ఛావా, యానిమల్ సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ బ్లాక్‌బస్టర్స్ అందుకున్నది. ఈ సక్సెస్‌లతో లక్కీ స్టార్‌గా మారిపోయింది రష్మిక మందన్న.
ఛావా (Chhaava) సక్సెస్‌తో బాలీవుడ్‌లో రష్మిక క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్‌గా రష్మిక మందన్న ఫస్ట్ ఛాయిస్‌గా మారిపోయింది. తాజాగా బాలీవుడ్‌లో రష్మిక మరో బంపరాఫర్ అందుకున్నట్లు సమాచారం. బ్లాక్‌బస్టర్ మూవీ సీక్వెల్‌లో హీరోయిన్‌గా నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. సైఫ్ అలీఖాన్ (Saif ali khan), దీపికా పదుకొనె (Deepika Padukone) 2012లో రిలీజైన కాక్‌టెయిల్ మూవీ కమర్షియల్ హిట్‌గా నిలిచింది. కేవలం 35 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ 125 కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. ఆ ఏడాది అత్యధిక వసూళ్లను రాబట్టిన బాలీవుడ్ మూవీగా నిలిచింది. దాదాపు 13 ఏళ్ల తర్వాత కాక్ టెయిల్ మూవీకి సీక్వెల్ రాబోతుంది.
కాక్ టెయిల్ 2 (Cocktail 2) పేరుతో తెరకెక్కుతోన్న ఈ సీక్వెల్‌లో షాహిద్ కపూర్ (Shahid Kapoor) హీరోగా నటిస్తుండగా…అతడికి జోడీగా రష్మిక మందన్న, కృతిసనన్ (Kriti Sanon) హీరోయిన్లుగా ఎంపికైనట్లు బాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మోడ్రన్ ఏజ్ రిలేషన్స్, ఫ్రెండ్‌షిప్స్ బ్యాక్‌డ్రాప్‌లో చాలా ఇన్నోవేటివ్‌గా ఈ సీక్వెల్ స్టోరీ ఉంటుందని చెబుతోన్నారు. ఈ సీక్వెల్‌లో మోడ్రన్ గర్ల్‌గా రష్మిక మందన్న క్యారెక్టర్ చాలా బోల్డ్‌గా సాగుతుందని చెబుతోన్నారు. ఈ సినిమాలో లిప్‌లాక్‌లో ఎక్కువేనని అంటున్నారు. కాక్ టెయిల్ 2కు హోమీ అద్జానియా దర్శకత్వం వహిస్తున్నాడు. అగస్ట్‌లో ఈ సీక్వెల్ షూటింగ్ మొదలుకాబోతున్నట్లు సమాచారం.
ప్రస్తుతం రష్మిక (Rashmika Mandanna) వరుస విజయాలను సొంతం చేసుకుంటోన్న సంగతి తెలిసిందే. లేటెస్ట్‌గా రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన కుబేర మూవీ ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. ధనుష్ (Dhanush) హీరోగా నటించిన ఈ మూవీ వంద కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాలో నాగార్జున ఓ కీలక పాత్రలో కనిపించాడు. ప్రస్తుతం తెలుగులో ది గర్ల్‌ఫ్రెండ్ పేరుతో ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తోంది రష్మిక మందన్న. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్ విషయం మరింత క్లారిటీ రానుంది. ఈ సినిమాకు నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు. హిందీలో థామా సినిమాలో నటిస్తోంది.