Tuesday, September 10, 2024
Homeచిత్ర ప్రభRashmika first look from 'Kubera': 'కుబేర'లో రష్మిక ఫస్ట్ లుక్ ఇదే

Rashmika first look from ‘Kubera’: ‘కుబేర’లో రష్మిక ఫస్ట్ లుక్ ఇదే

శేఖర్ కమ్ముల ‘కుబేర’ నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ జూలై 5న విడుదల

- Advertisement -

నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ మేకర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ సోషల్ డ్రామా ‘కుబేర’ మోస్ట్ ఎవెయిటింగ్ పాన్-ఇండియన్ చిత్రాలలో ఒకటి. ఈ చిత్రం నుంచి రష్మిక మందన్న అఫీషియల్ ఫస్ట్‌లుక్ గ్లింప్స్ ఇంటర్నెట్‌లో సంచలనం క్రియేట్ చేస్తూ మాగ్నం ఓపస్ కోసం ఎక్సయిట్మెంట్ ని మరింతగా పెంచింది.

అఫీషియల్ లుక్ ని 5 జూలై 2024న లాంచ్ చేస్తుండగా, మేకర్స్ విడుదల చేసిన పోస్టర్‌లో రష్మిక క్యారెక్టర్ పింక్ కలర్ సూట్ ధరించి, ఆమె వెనుక సూట్‌కేస్‌ని లాగుతున్నట్లు ప్రెజెంట్ చేసింది. కొత్త పోస్టర్‌ని విడుదల చేయడంతో పూర్తి లుక్‌ని చూడాలనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.

ఇప్పటికే కుబేర నుంచి విడుదలైన సూపర్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున అక్కినేని ఫస్ట్ లుక్‌లు దేశవ్యాప్తంగా ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందనలు అందుకున్నాయి.

‘శేఖర్ కమ్ముల ‘కుబేర’ లో ధనుష్, కింగ్ నాగార్జున అక్కినేని, రష్మిక మందన్న, జిమ్ సర్భ్ వంటి ప్రముఖ తారాగణం నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘శేఖర్ కమ్ముల కుబేర’ పాన్-ఇండియా మల్టీ లాంగ్వేజ్ ఫిల్మ్ తమిళం, తెలుగులో ఏకకాలంలో షూటింగ్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News