THAMMA MOVIE: బాలీవుడ్ మూవీ ‘థామా’ ప్రమోషన్‌లో బిజీగా ఉన్న రష్మికా మందన్న, కన్నడ చిత్ర పరిశ్రమ తనను నిషేధించిందనే ప్రచారానికి స్పందించారు. కన్నడ సినిమాలతోనే నటిగా కెరీర్ ప్రారంభించిన ఆమె, చాలా కాలంగా కన్నడ సినిమాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో ఆమెపై కన్నడ పరిశ్రమ నిషేధం విధించిందనే ఊహాగానాలు తలెత్తాయి. తాజాగా కర్ణాటకలో మీడియాతో మాట్లాడిన ఆమె, “ఇప్పటివరకు నన్ను నిషేధించలేదు.” అని స్పష్టం చేశారు.
ALSO READ: https://teluguprabha.net/cinema-news/vijay-rashmika-net-worth-properties/
‘కాంతార’ టీమ్‌ను ఎందుకు అభినందించలేదు?
రిషబ్ శెట్టి లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ మూవీ ‘కాంతార: చాప్టర్ 1’కి రష్మిక ఎందుకు పబ్లిక్‌గా అభినందనలు తెలియజేయలేదని పలువురు కన్నడిగులు ఆమెను ప్రశ్నించారు. దీనిపై స్పందించిన రష్మిక, ఆ సినిమా రిలీజైన వెంటనే తాను చూడలేదనీ, కానీ తర్వాత చూసి, టీమ్‌కు అభినందనలు తెలియజేస్తూ మెసేజ్ పంపాననీ తెలిపారు. తెరవెనుక ఏం జరుగుతుందో జనానికి తెలియదని రష్మిక అన్నారు. “ఒక వ్యక్తి జీవితం గురించి జనం ఏం చెప్పారనేది ముఖ్యం కాదు. కానీ, మా ప్రొఫెషనల్ లైఫ్ గురించి వాళ్లు చెప్పేదాన్ని మేం లెక్కలోకి తీసుకొని, దానికి తగ్గట్లు పనిచేస్తాం” అని ఆమె తెలిపారు.
ALSO READ: https://teluguprabha.net/cinema-news/nayanthara-fake-bomb-threat-chennai/
వృత్తి, వ్యక్తిగత జీవితం
రష్మిక బాలీవుడ్ మూవీ ‘తమ్మ’ అక్టోబర్ 21న థియేటర్లలో విడుదల కానుంది. ఆదిత్య సర్పోట్దార్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించారు. ప్రస్తుతం రష్మిక చేతిలో ది గర్ల్‌ఫ్రెండ్, మైసా, కాక్‌టెయిల్ 2 వంటి సినిమాలున్నాయి. అలాగే సందీప్ రెడ్డి సినిమా యానిమల్ పార్క్ కూడా ఆమె చేయాల్సి ఉంది. వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే, దసరా సంబరాల సమయంలో స్టార్ హీరో విజయ్ దేవరకొండతో ఆమె నిశ్చితార్థం చేసుకున్నట్లు సమాచారం. 2026 ఫిబ్రవరిలో వారు వివాహం చేసుకోనున్నారని ప్రచారంలో ఉంది.


