The Girl Friend: 2025 రష్మిక మందన్న కెరీర్‌లో లక్కీ ఇయర్‌గా నిలిచింది. ది గర్ల్‌ఫ్రెండ్ మూవీతో ఈ ఏడాది నాలుగో బ్లాక్‌బస్టర్‌ను అందుకుంది. ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీ మంగళవారం నాటితో బ్రేక్ ఈవెన్‌ను సాధించింది. వరల్డ్ వైడ్‌గా ఏడు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ టార్గెట్‌తో ది గర్ల్‌ఫ్రెండ్ మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. మంగళవారం నాటితో 8.85 కోట్ల వసూళ్లను సొంతం చేసుకొని లాభాల్లోకి అడుగుపెట్టింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్‌సీస్‌లో కూడా ప్రాఫిట్ జోన్‌లోకి ఎంటరై క్లీన్ హిట్‌గా నిలిచింది.
ది గర్ల్‌ఫ్రెండ్ మూవీతో లేడీ ఓరియెంటెడ్ జానర్‌లో ఫస్ట్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది రష్మిక మందన్న. ఈ ఏడాది రష్మిక మందన్నకు నాలుగో బ్లాక్‌బస్టర్ ఇది. 2025లో బాలీవుడ్‌లో ఛావా, థామాతో పాటు తెలుగులో కుబేర సినిమాలతో విజయాలను దక్కించుకుంది రష్మిక మందన్న. సల్మాన్ ఖాన్‌తో చేసిన సికందర్ మూవీ ఒక్కటే బాక్సాఫీస్ వద్ద డిసపాయింట్ చేసింది. 2025లో అత్యధిక విజయాలను అందుకున్న హీరోయిన్‌గా కూడా రష్మిక నిలిచింది.
ది గర్ల్‌ఫ్రెండ్ మూవీకి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించాడు. రష్మిక మందన్నతో పాటు అను ఇమ్మాన్యుయేల్ మరో హీరోయిన్‌గా కనిపించింది. దీక్షిత్ శెట్టి హీరోగా నటించాడు. ది గర్ల్‌ఫ్రెండ్ మూవీలో భూమా పాత్రలో రష్మిక నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. ఎమోషనల్ రోల్‌లో అదరగొట్టిందని ఫ్యాన్స్ చెబుతున్నారు.
Also Read – Sudheer Babu: డిజాస్టర్స్‌లో ‘నవ దళపతి’ రికార్డ్!
బుధవారం ది గర్ల్‌ఫ్రెండ్ మూవీ సక్సెస్ మీట్‌ను నిర్వహించబోతున్నారు. హైదరాబాద్‌లో జరుగనున్న ఈ సక్సెస్ మీట్‌కు విజయ్ దేవరకొండ చీఫ్ గెస్ట్‌గా హాజరు కాబోతున్నాడు. కాగా మంగళవారం అభిమానులతో కలిసి రష్మిక ది గర్ల్‌ఫ్రెండ్ సినిమా చూసింది. మూవీకి వస్తోన్న రెస్పాన్స్ చూసి ఎమోషనల్ అయ్యింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ది గర్ల్‌ఫ్రెండ్ తర్వాత తెలుగులో మైసా పేరుతో మరో లేడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తోంది రష్మిక మందన్న. గోండు తెగల బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ మూవీలో యాక్షన్ రోల్‌లో కనిపించబోతున్నది. మైసా మూవీకి రవీంద్ర పుల్లే దర్శకత్వం వహిస్తున్నాడు. మైసాతో పాటు విజయ్ దేవరకొండ, డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ కాంబినేషన్‌లో తెరకెక్కతున్న సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.
హిందీలో కాక్ టెయిల్ 2 సినిమా చేస్తోంది. షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ మూవీలో కృతి సనన్ మరో నాయికగా కనిపించబోతున్నది.
Also Read – Sravanthi Chokarapu: గోవా బీచ్‌లో గ్లామర్ గేమ్ స్టార్ట్ చేసిన స్రవంతి!


