Comrade Kalyan: కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు నటించిన తాజా పీరియడ్ ఎలిమెంట్స్, హ్యూమర్, రొమాన్స్, ఎమోషనల్ ఎంటర్టైనర్ ‘కామ్రేడ్ కళ్యాణ్’. జానకిరామ్ మారెళ్ల దర్శకత్వం వహిస్తున్నారు. కోన వెంకట్ సమర్పణలో స్కంద వాహన మోషన్ పిక్చర్స్ ఎల్ఎల్పీ బ్యానర్‌పై వెంకట కృష్ణ కర్నాటి, సీతా కర్నాటి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్ పాటలతో సినిమాపై అంచనాలు పెరిగాయి.
తాజాగా మాస్ మహారాజా రవితేజ ‘కామ్రేడ్ కళ్యాణ్’ టైటిల్ సాంగ్ లాంచ్ చేశారు. విజయ్ బుల్గానిన్ ఫన్ ఫుల్ గా ఈ పాటను కంపోజ్ చేశారు. రాహుల్ సిప్లిగంజ్ వాయిస్‌తో పవర్ఫుల్ ఎనర్జీని అందించగా, భాస్కరభట్ల రాసిన లిరిక్స్ కామ్రేడ్ గా హీరో క్యారెక్టర్ ను ఎంటర్టైనింగ్ గా ప్రజెంట్ చేశాయి. విడుదలైన వెంటనే ఈ సాంగ్ వైరల్ అవుతోంది. అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రంలో రాధికా శరత్‌కుమార్, షైన్ టామ్ చాకో, ఉపేంద్ర లిమాయే కీలక పాత్రల్లో నటించగా…విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తుండగా, సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. చోటా కె. ప్రసాద్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.

