Saturday, October 5, 2024
Homeచిత్ర ప్రభRaviteja: రవితేజ అసిస్టెంట్ ఎమోషనల్ ట్వీట్.. అసిస్టెంట్ కోసం మాస్ రాజా ఏం చేశాడంటే?

Raviteja: రవితేజ అసిస్టెంట్ ఎమోషనల్ ట్వీట్.. అసిస్టెంట్ కోసం మాస్ రాజా ఏం చేశాడంటే?

- Advertisement -

Srinivas : మాస్ మహారాజ్ రవితేజ కష్టపడి పైకొచ్చిన హీరో. తను స్టార్ అయ్యాక తనలాంటి ఎంతో మందికి సపోర్ట్ చేస్తున్నాడు. చాలా మందిని డైరెక్టర్స్ గా పరిచయం చేశాడు రవితేజ. ఇక తన దగ్గర ఉండేవాళ్ళకి కూడా ఫుల్ సపోర్ట్ చేస్తాడు రవితేజ. ప్రస్తుతం రవితేజ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.

తాజాగా రవితేజ దగ్గర ఎప్పట్నుంచో పర్సనల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న శ్రీనివాస్ సొంత కారు కొనుక్కున్నాడు. అయితే కారుని మొదట రవితేజ తోలాడు. శ్రీనివాస్ కారు కొనడం, తను కూర్చుంటే రవితేజ డ్రైవ్ చేయడం ఇదంతా వీడియో తీసి తన సోషల్ మీడియాలో షేర్ చేసుకొని ఎమోషనల్ అయ్యాడు.

శ్రీనివాస్ ఆ వీడియోని షేర్ చేసి.. ”ఊరిలో సైకిల్ తొక్కునేవాడ్ని ఇప్పుడు కారు కొనుక్కున్నాను. ఇదంతా మీ వల్లే. మనం కలిసి చాలా మైళ్ళు ప్రయాణించొచ్చు. కానీ మీరు నా కారు నడుపుతున్నప్పుడు నేను పక్కన కూర్చున్న ఆ కొన్ని క్షణాలు మాత్రం నాకు ప్రత్యేకం. ఇదంతా మీవల్లే. నాకు మీరే సర్వస్వం. నా మాస్ గాడ్ రవితేజకి ప్రత్యేక ధన్యవాదాలు. నా మిగిలిన జీవితం కూడా మీకే సొంతం” అంటూ ఎమోషనల్ గా పోస్ట్ చేశాడు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News