Homeచిత్ర ప్రభRC 17: జూన్ లో చరణ్-సుకుమార్ మూవీ షూటింగ్ స్టార్ట్.. మైత్రీ చెర్రీ క్లారిటీ

RC 17: జూన్ లో చరణ్-సుకుమార్ మూవీ షూటింగ్ స్టార్ట్.. మైత్రీ చెర్రీ క్లారిటీ

Ram Charan: రామ్ చరణ్, టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో ఓ భారీ ప్రాజెక్ట్ రూపొందనుంది. ఇప్పటికే దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. కానీ, ఇంతర వరకు ఈ మూవీ సెట్స్ పైకి రాలేదు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి నిర్మాత కీలక అప్డేట్ ఇచ్చారు. కాగా ‘RC 17’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఓ మూవీని ప్రకటించారు.

- Advertisement -

పెద్దితో బిజీ
ప్రస్తుతం రామ్ చరణ్, బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పెద్ది’ సినిమాతో బిజీగా ఉన్నాడు. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ పూర్తి కానుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరిలో ఉంది. మరో ఒకటి, రెండు రోజుల్లో ఈ మూవీ మొత్తం షూటింగ్ పూర్తి కానుంది. దీని తర్వాత చరణ్, సుకుమార్ మూవీ కోసం సన్నద్దమవుతున్నాడట. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ సీఈవో చెర్రీ వెల్లడించారు.

జూన్ నుంచి షూటింగ్
తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… జూన్ నెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని వెల్లడించారు. ఇక ‘పెద్ది’ సినిమాను కూడా జూన్‌లోనే విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దీంతో ‘పెద్ది’ షూటింగ్ పూర్తి కాగానే రామ్ చరణ్ నేరుగా సుకుమార్ ప్రాజెక్ట్‌లో జాయిన్ కానున్నాడు. ఇప్పటికే వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘రంగస్థలం’ బ్లాక్‌బస్టర్ కావడంతో ఈ కొత్త సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News