Record Views for Peddhi trailer: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న ‘పెద్ది’ చిత్రం ట్రైలర్ విడుదలైన 24 గంటల్లోనే ఏకంగా 101 మిలియన్లకు (10 కోట్లకు) పైగా వ్యూస్ సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. టాలీవుడ్‌లో 24 గంటల్లో అత్యధిక వ్యూస్ సాధించిన మొట్టమొదటి తెలుగు సినిమా ట్రైలర్‌గా రికార్డుకెక్కింది. రామ్‌చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. ఈ సినిమాలో శ్రీదేవి కూతురు, బాలీవుడ్ నటి జాన్వీకపూర్ కథానాయికగా నటిస్తోంది. పాన్ ఇండియా మూవీగా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read: Chandrababu Naidu: గరిటె తిప్పి.. చేపల పులుసు వండి.. సీఎం నెల్లూరు పర్యటనలో ఆసక్తికర సన్నివేశం
24 గంటల్లో 101 మిలియన్ రికార్డు వ్యూస్..
ఈ క్రమంలో సోమవారం విడుదల చేసిన ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంటోంది. విడుదలైన కొద్ది గంటల్లోనే యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తోంది. గత రికార్డులన్నీ తిరగరాసి కేవలం 24 గంటల్లో 101 మిలియన్ రికార్డు వ్యూస్ (అన్ని భాషల్లో కలిపి) సాధించినట్లు చిత్ర బృందం వెల్లడించింది. అంతేకాదు, అతి తక్కువ సమయంలో ఈ ఘనత సాధించిన తెలుగు ట్రైలర్‌గా నిలిచింది. క్రాస్ ఓవర్ అథ్లెట్‌గా ‘పెద్ది’లో రామ్‌చరణ్ కనిపించిన విధానం, బుచ్చిబాబు టేకింగ్ సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి. క్రికెటర్, రెజ్లర్, రన్నర్‌గా రామ్‌చరణ్ కనిపించనున్నట్లు ప్రచార చిత్రం చూస్తే అర్థమవుతోంది. ఈ చిత్రం విడుదలకు ముందే రికార్డులు బ్రేక్ చేయడంపై రామ్ చరణ్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

