Thursday, May 15, 2025
Homeచిత్ర ప్రభSonu Nigam: కర్ణాటక హైకోర్టులో సోనూ నిగమ్‌కి ఊరట

Sonu Nigam: కర్ణాటక హైకోర్టులో సోనూ నిగమ్‌కి ఊరట

బాలీవుడ్ సింగర్‌ సోనూ నిగమ్‌(Sonu Nigam)కి కర్ణాటక హైకోర్టులో ఊరట దక్కింది. ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు పోలీసులను ఆదేశించింది. అదే సమయంలో విచారణకు పూర్తిస్థాయిలో సహకరించాలని సోనూకి సూచించింది.

- Advertisement -

కాగా గత నెలలో పహల్లాం ఉగ్రదాడి అనంతరం బెంగళూరులో సోనూ కాన్సర్ట్‌ నిర్వహించారు. అయితే ఈ ప్రదర్శనలో కన్నడ పాటలే పాడాలని ఓ అభిమాని డిమాండ్‌ చేశాడు. దీనిపై అసహనం వ్యక్తం చేసిన సోనూ పహల్గాంలో చోటుచేసుకున్న ఘటనకు ఇలాంటి బాషా విద్వేషాలే కారణమంటూ స్పందించారు.

దీంతో అతడిన వ్యాఖ్యలపై కన్నడిగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కర్ణాటక రక్షణ వేదిక’ బెంగళూరు సిటీ యూనిట్‌ అధ్యక్షుడు ధర్మరాజ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ‘కర్ణాటక ఫిల్మ్‌ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌’ ఆయనను బ్యాన్‌ చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలో కన్నడ ప్రజలకు సోనూ క్షమాపణలు చెప్పారు. అయితే తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News