తమిళ నటుడు ప్రదీప్ రంగనాథన్ ‘లవ్ టుడే’ చిత్రంతో తెలుగులోనూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇటీవల ఆయన హీరోగా నటించిన ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’(Return Of The Dragon) చిత్రం థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్‌ను తెచ్చుకుంది. బాక్సాఫీస్ వద్ద కూడా మంచి వసూళ్లు రాబట్టింది. అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించింది. ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు శుభవార్త వచ్చేసింది.
ఈ చిత్ర ఓటీటీ హక్కులను దక్కించుకున్న ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్(Netflix) ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించింది. ఈమేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టర్ విడుదల చేసింది. మార్చి 21వ తేదీ నుంచి తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మళయాళ బాషల్లో అందుబాటులో ఉండనున్నట్లు తెలిపింది.