Thursday, December 19, 2024
Homeచిత్ర ప్రభపుష్ప 2 దుర్ఘటన... రేవతి మరణంపై స్పందించిన భర్త

పుష్ప 2 దుర్ఘటన… రేవతి మరణంపై స్పందించిన భర్త

పుష్ప 2 (Pushpa 2) ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి (Revathi) అనే మహిళ మరణించింది. ఆమె కుమారుడు శ్రీతేజ (Sri Teja) ప్రాణాపాయ స్థితిలో ప్రకాష్ నగర్ కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. కాగా, రేవతి మరణంపై ఆమె భర్త స్పందించారు.

- Advertisement -

రేవతి భర్త మాట్లాడుతూ… “మా అబ్బాయి శ్రీతేజ అల్లు అర్జున్ (Allu Arjun) అభిమాని. వాడి కోసమే మేము సినిమాకి వచ్చాము మొదట నా భార్య పిల్లలు లోపలికి వెళ్లారు. అప్పటికి అభిమానులు మాములుగానే ఉన్నారు. అల్లు అర్జున్ రావడంతో ఒక్కసారిగా క్రౌడ్ పెరిగింది. తొక్కిసలాట జరిగింది. పోలీసులు CPR చేసినపుడు మా బాబు స్పృహలోకి వచ్చాడు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. మా బాబు పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్స్ చెప్పారు. కానీ మా భార్యను కోల్పోవడం తట్టుకోలేకపోతున్నా” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

మరోవైపు రేవతి బంధువులు ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అల్లు అర్జున్ బాధ్యతారాహిత్యం వల్లే ఇలా జరిగిందని వాపోతున్నారు. ఇప్పటికీ ఈ ఘటన పై అల్లు అర్జున్ స్పందించలేదని మండిపడుతున్నారు. వెంటనే అల్లు అర్జున్ స్పందించి కుటుంబానికి అండగా ఉండాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. సంధ్య థియెటర్ పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News