విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(RGV) తాజాగా తెరకెక్కిస్తున్న మూవీ ‘శారీ'(SAREE MOVIE). గిరి కృష్ణకమల్ దర్శకత్వంలో,ఆర్జీవీ-ఆర్వి ప్రొడక్షన్స్ LLP బ్యానర్‌పై ప్రముఖ వ్యాపారవేత్త రవి శంకర్ వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా తెలుగు, హిందీ, తమిళ, మరియు మళయాళ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. సత్య యాదు, ఆరాధ్య దేవి హీరో హీరోయిన్లుగా నిజజీవిత సంఘటనల ఆధారాలతో సైకలాజికల్ థ్రిల్లర్‌గా ‘శారీ’ మూవీ రూపొందుతోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, పాటలు సినిమాపై హైప్ పెంచాయి
తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసారు. మీరు కూడా శారీ ట్రైలర్ చూసేయండి. ఎప్పుడూ చీరలే కట్టుకునే ఓ అమ్మాయిని ఓ ఫోటోగ్రాఫర్ ఇష్టపడతాడు. అమెపై ప్రేమ మరీ ఎక్కువై సైకోగా మారి ఎలాంటి పనులు చేసాడు? ఆ అమ్మాయిని ఎలా ఇబ్బంది పెట్టాడు అనే కథతో శారీ సినిమా ఉండబోతుందని ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ టూమచ్ లవ్ ట్రైలర్ చూసేయండి.