Mowgli Teaser: తన తొలి చిత్రం ‘బబుల్‌గమ్’ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో రోషన్ కనకాల నటించిన లేటెస్ట్ మూవీ ‘మోగ్లీ 2025’. ‘కలర్ ఫోటో’ లాంటి నేషనల్ అవార్డ్ విన్నింగ్ సినిమా తీసిన టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రాజ్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా టీజర్‌ను రీసెంట్ గా జూనియర్ ఎన్టీఆర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ సినిమాను టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ కలిసి తమ ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇందులో సాక్షి సాగర్ మడోల్కర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, కాలభైరవ మ్యూజిక్ అందిస్తున్నాడు.
ఈ టీజర్ లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న పాత్ర ఏదైనా ఉంది అంటే అది విలన్ ‘నోలన్’. ఈ పాత్రను బండి సరోజ్ కుమార్ పోషిస్తున్నాడు. గతంలో కొన్ని సినిమాలకు హీరోగా, దర్శకుడిగా పనిచేసిన సరోజ్, ఈ మూవీలో పవర్‌ఫుల్ నెగెటివ్ రోల్‌లో కనిపించబోతున్నాడు. టీజర్‌లో తన స్క్రీన్ ప్రెజెన్స్, లుక్ చాలా ఇంటెన్స్‌గా ఉన్నాయి. టీజర్‌లో రోషన్‌కు, సరోజ్‌కు మధ్య వచ్చే కాన్ఫ్లిక్ట్ సినిమాకు మేజర్ హైలైట్‌గా ఉండబోతుంది అనిపిస్తోంది.
ALSO READ: Re Releases: ‘శివ’ నుంచి ‘బిజినెస్ మ్యాన్’ వరకు రీ రిలీజ్‌ల హవా!
టీజర్ మొత్తం చూస్తే, ఇది అడవి నేపథ్యంతో సాగే ఒక ప్యూర్ లవ్ స్టోరీగా, దానికితోడు గ్రిప్పింగ్ యాక్షన్ ఎలిమెంట్స్ ఉన్న సినిమా అని అర్థమవుతోంది. కాలభైరవ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, సినిమా విజువల్స్ చాలా క్వాలిటీగా ఉన్నాయి. దర్శకుడు సందీప్ రాజ్ ఈ కథను ఎంత ఎమోషనల్‌గా, పవర్‌ఫుల్‌గా చూపించాలనుకుంటున్నాడో టీజర్ లో అర్ధం అవుతుంది.
ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే దాదాపుగా పూర్తైంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ‘మోగ్లీ 2025’ సినిమా డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.


