Sunday, July 7, 2024
Homeచిత్ర ప్రభRRR: గోల్డెన్ గ్లోబ్ గెలుచుకున్న నాటు నాటు సాంగ్

RRR: గోల్డెన్ గ్లోబ్ గెలుచుకున్న నాటు నాటు సాంగ్

ఆర్ఆర్ఆర్ సినిమాకు అవార్డుల పంట పండుతోంది. గోల్డెన్ గ్లోబ్ అవారుడును గెలుచుకుంది ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు సాంగ్. వల్డ్ సినిమాకే తలమానికంగా భావించే గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావటంతో రాజమౌళి బృందానికి భారతీయ ప్రముఖులంతా కంగ్రాట్స్ చెబుతున్నారు. ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు సాంగ్ కు అవార్డు రావటంతో భారతీయులకు ఆనందం ఇస్తోంది. క్యాలిఫోర్నియాలోని ది బెవర్లీ హిల్టన్ హాల్ లో ఈ అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా సాగింది. రాజమౌళి, చరణ్, ఎన్టీఆర్, కీరవాణి, రామ్ చరణ్ అవార్డుల కార్యక్రమంలో హాజరయ్యారు. ప్రస్తుతం సోషల్ మీడియా అంతా ఆర్ఆర్ఆర్, నాటు నాటు న్యూస్ తో హోరెత్తుతోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News