ఈరోజు ఎపిసోడ్‌లో రుద్రాణి స్వప్న మీద చూపిస్తున్న ప్రేమకి ఇంట్లో వాళ్లు అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయినా బడ్జెట్ ఎంతో చెప్తుంది కదా అప్పుడు కావ్య డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకోవాలిగా అంటుంది అపర్ణ. రాజ్, కావ్య మాట్లాడుకుంటుంటే మధ్యలో రుద్రాణి ఏంటి మొగుడు పెళ్లాలు చెవులు కొరుక్కుంటున్నారు అంటుంది. మీ కెందుకండి మీ పనులు మీరు చూసుకోండి అన్ని రాసుకోండి అంటుంది. మొత్తానికి లిస్ట్ అంతా రాయించి కావ్యకి ఇచ్చి ఇదిగో మొత్తం సీమంతానికి అయ్యే ఖర్చు రాసాము. మొత్తం బడ్జెట్ రూ.20 లక్షలు అంటుంది రుద్రాణి. అప్పుడు ఇంట్లో వాళ్లు అందరూ షాక్ అవుతారు. ప్రకాశం, ధాన్యలక్ష్మి మీరు కంగారు పడకండి. కావ్యను డబ్బు ఇవ్వనివ్వండి నేను ఉన్నాను కదా తగులుకోడానికి అంటుంది. కావ్య మీరు అడుగుతారని ముందే నేను కుడా రూ.20 లక్షల చెక్ రాసాను ఆగండి ఇస్తాను అని రుద్రాణికి చెక్ ఇస్తుంది.
ఈలోగా వెంటనే ఎక్కడినుంచో ఊడిపడినట్టు కనకం వస్తుంది. ఏంటి అమ్మా అమ్మవి కాబోతున్నావు ఈ అమ్మ గుర్తురాలేదా అంటుంది స్వప్నని. మేము పేద వాళ్లమే కానీ నీ కోసం ఎప్పుడు మా ఇంటి తలుపులు తీసే ఉంటాయి అంటుంది కనకం. రుద్రాణి స్వప్నకు తన చేతుల మీద సీమంతం చేయాలనుకుంటుంది అని అపర్ణ కనకం కి చెప్తుంది. అంతే కనకం నాటకం మొదలుపెట్టేస్తుంది, మా సాంప్రదాయం, ఆచారం అంతా గంగలో కలిసిపోతుంది. మా స్వప్నకు మా ఇంట్లోనే సీమంతం జరగాలని కనకం అంటుంది. రుద్రాణి ఏమో మా ఇంట్లో ఘనంగా జరిపించాలనుకుంటుంటే నువ్వు ఏంటి ఆ పూరి గుడిసెలో చేస్తావా అని ఇద్దరూ మాటలు మాటలు అనుకుంటారు.
ఓ అరిసి అరిసి గోల గోల చేస్తుంది కనకం. మా ఇంట్లోనే సీమంతం చేస్తాము మీ అంత కాకపోయినా ఏదో చేస్తాము అంటుంది. అందుకు ధాన్యలక్ష్మిని న్యాయం అడుగుతుంది ఎక్కడ చేయడం మంచిది అని ధాన్యం కుడా మీ ఇంట్లో చేయడమే మంచిది అని చెప్తుంది. రుద్రాణి, రాహుల్, స్వప్న ముగ్గురూ ఒప్పుకోము అంటారు. కనకం ఓవర్ యాక్షన్ చేసి అందరినీ ఒప్పిస్తుంది. ఇంక చేసేది ఏమి ఉంది అని కావ్య రుద్రాణి చేతిలో చెక్ తీసుకుని చింపేస్తుంది. ఈ రూ.20 లక్షల నుంచి రూ.10 లక్షలు నొక్కేద్దామనుకున్నామని రాహుల్, రుద్రాణి బాధపడతారు. అందరినీ సీమంతానికి రమ్మని కనకం వెళ్లిపోతుంది.
మరోవైపు కవి, అప్పు ఫోన్‌లో మాట్లాడుకుంటారు ఒక పాట రాసాను బాగా వచ్చింది అని చెప్తాడు. రాసిన పాటను పాడి వినిపిస్తాడు. అది అయ్యాక వారి ఇద్దరూ ఒకరిని ఒకరు ఎంత మిస్ అవుతున్నారో చెప్పుకుంటారు. అలా మాట్లాడుకుని ఫోన్ పెట్టేసుకుంటారు. అక్కడ రుద్రాణి వేసిన ప్లాన్ వర్కౌట్ అవ్వలేదని ఓ తెగ ఇరిటేట్ అయిపోతారు. ప్లాన్ చెడగొట్టిన కనకం, కావ్య ను తిట్టుకుంటారు. ఇంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది.