Sunday, January 18, 2026
Homeచిత్ర ప్రభNTR Dradon: ఎన్టీఆర్ డ్రాగ‌న్‌లో హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసిన కన్న‌డ బ్యూటీ - క‌న్ఫామ్ చేసిన...

NTR Dradon: ఎన్టీఆర్ డ్రాగ‌న్‌లో హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసిన కన్న‌డ బ్యూటీ – క‌న్ఫామ్ చేసిన ప్రొడ్యూస‌ర్‌

NTR Dradon: ఎన్టీఆర్ డ్రాగ‌న్ మూవీని అనౌన్స్‌చేసి ఏడాదిపైనే అవుతుంది. కానీ ఇప్ప‌టివ‌ర‌కు సినిమాలో హీరోయిన్ ఎవ‌ర‌న్న‌ది మేక‌ర్స్ అఫీషియ‌ల్‌గా వెల్ల‌డించ‌లేదు. ఇందులో ఎన్టీఆర్‌కు జోడీగా న‌టించ‌బోతున్న‌ట్లు ర‌ష్మిక మంద‌న్న‌, శ్ర‌ద్దాక‌పూర్‌తో పాటు ప‌లువురు బాలీవుడ్‌, సౌత్ టాప్ స్టార్స్ పేర్లు వినిపించాయి. అవ‌న్నీ పుకార్లుగానే మిగిలాయి. ఎట్ట‌కేల‌కు డ్రాగ‌న్ హీరోయిన్‌ క‌న్ఫామ్ అయ్యింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ స‌ర‌స‌న న‌టించే ఛాన్స్‌ను క‌న్న‌డ బ్యూటీ రుక్మిణి వ‌సంత్ కొట్టేసింది. హీరోయిన్‌గా ఈ ముద్దుగుమ్మ పేరు కూడా చాలా రోజులు నుంచి ప్ర‌చారం జ‌రుగుతోంది. చివ‌ర‌కు ఆమెనే ఈ అవ‌కాశం వ‌రించింది

- Advertisement -

మ‌ద‌రాసి ఈవెంట్‌లో…
డ్రాగ‌న్‌లో రుక్మిణి వ‌సంత్ న‌టించ‌బోతున్న‌ విష‌యాన్ని టాలీవుడ్ సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ ఎన్వీ ప్ర‌సాద్ ఆదివారం జ‌రిగిన మ‌ద‌రాసి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అఫీషియ‌ల్‌గా వెల్ల‌డించారు. మ‌ద‌రాసిలో రుక్మిణి వసంత్‌ను సెలెక్ట్ చేసే టైమ్‌లో అప్‌క‌మింగ్ హీరోయిన్‌. కానీ ఇప్పుడు కాంతార 2తో పాటు జూనియ‌ర్ ఎన్టీఆర్ మూవీలో ఆమెనే హీరోయిన్‌. య‌శ్ టాక్సిక్ మూవీ కూడా చేస్తుంది అని ఎన్వీప్ర‌సాద్ అన్నారు. ఆయ‌న కామెంట్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఎన్టీఆర్‌, రుక్మిణి వ‌సంత్ జోడీ బాగుంటుంద‌ని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

Also Read- Ram Charan: స‌రికొత్త జాన‌ర్‌లో రామ్‌చ‌ర‌ణ్ మూవీ – సుకుమార్ ప్లాన్స్ నెక్స్ట్ లెవెల్‌!

ప‌దిహేను కోట్ల‌తో…
డ్రాగ‌న్ మూవీకి ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. పీరియాడిక‌ల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా రూపొందుతున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో డ్రాగ‌న్ మూవీ షూటింగ్‌లోకి ఎన్టీఆర్ అడుగుపెట్టారు. మంగ‌ళూరులో ఎన్టీఆర్‌తో పాటు ప్ర‌ధాన తారాగ‌ణంపై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించారు ప్ర‌శాంత్ నీల్‌. ఈ మూవీ నెక్స్ట్ షెడ్యూల్ సెప్టెంబ‌ర్ సెకండ్ వీక్ నుంచి మొద‌లుకానుంది. నెక్స్ట్ షెడ్యూల్ కోసం దాదాపు ప‌దిహేను కోట్ల‌తో హైద‌రాబాద్‌లో ఓ భారీ హౌజ్ సెట్ వేస్తున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

350 కోట్ల బ‌డ్జెట్‌తో…
డ్రాగ‌న్ మూవీలో మ‌ల‌యాళం హీరో టోవినో థామ‌స్‌తో పాటు న‌టుడు బిజు మీన‌న్ కీల‌క పాత్ర‌లు పోషించ‌బోతున్నారు. దాదాపు 350 కోట్ల బ‌డ్జెట్‌తో ఈ మూవీ తెర‌కెక్కుతోంది. డ్రాగ‌న్ మూవీ వ‌చ్చే ఏడాది ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది.

వార్ 2 డిజాస్ట‌ర్‌…
కాగా ఎన్టీఆర్ గ‌త మూవీ వార్ 2 డిజాస్ట‌ర్‌గా నిలిచింది. ఈ స్పై యాక్ష‌న్ మూవీతోనే బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు ఎన్టీఆర్‌. నెగెటివ్ టాక్‌తో క‌లెక్ష‌న్స్ ప‌రంగా ప‌ర్వాలేద‌నిపించింది. 350 కోట్ల వ‌ర‌కు వ‌సూళ్ల‌ను ద‌క్కించుకున్న‌ది. వార్ 2లో ఎన్టీఆర్‌తో పాటు హృతిక్ రోష‌న్ హీరోగా న‌టించాడు. డ్రాగ‌న్ త‌ర్వాత దేవ‌ర 2 సినిమా చేయ‌బోతున్నాడు ఎన్టీఆర్‌.

Also Read- Pragati Srivastava: హాట్ లుక్స్ తో అలజడి రేపుతున్న టాలీవుడ్ నయా బ్యూటీ

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News