Rumors on Mouni roy and disha patani relationship: బాలీవుడ్ గ్లామర్ క్వీన్స్ దిశా పటానీ, మౌనీ రాయ్ మధ్య ఉన్న స్నేహంపై గత కొంతకాలంగా సోషల్ మీడియాలో అనేక రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కో రకంగా రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు. ఈ ఇద్దరూ రిలేషన్‌లో ఉన్నారని, వీరిద్దరూ లెస్బియన్స్ అని కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రూమర్స్ వైరల్ అయ్యాయి. వీరిద్దరూ తరచూ కలిసి విదేశీ టూర్లకు వెళ్లడం, పార్టీల్లో చాలా క్లోజ్‌గా కనిపించడం, అలాగే, హాట్ హాట్ పోజులతో వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం వంటివి ఈ రూమర్స్‌కు మరింత బలాన్ని చేకూర్చాయి.
Also read: TDP Mahanadu: టీడీపీ మహానాడు తొలిరోజే భారీ విరాళాలు.. ఎవరెంత ఇచ్చారంటే?
సిస్టర్ అంటూ పోస్టు పెట్టి వెంటనే డిలీట్..
ఇటీవల, మౌనీ రాయ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో దిశా పటానీతో కలిసి ఉన్న ఒక ఫోటోను పోస్ట్ చేశారు. ఆ ఫోటోకు ఆమె “నా లిటిల్ సిస్టర్‌ను చాలా మిస్ అవుతున్నాను” అనే క్యాప్షన్ కూడా ఇచ్చారు. తమపై జరుగుతున్న రూమర్స్‌కు చెక్ పెట్టేందుకే ఈ కామెంట్ చేసినట్లు నెటిజన్లు చెబుతున్నారు. ఈ కామెంట్ ద్వారా ఇద్దరి మధ్య ఉన్నది కేవలం మంచి స్నేహమేనని చెప్పే ప్రయత్నం చేసినట్లు నెట్టింట్లో చర్చ జరిగింది. అయితే, ఈ పోస్ట్ పెట్టిన కొద్దిసేపటికే మౌనీ రాయ్.. తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుంచి డిలీట్ చేయడం ఇప్పుడు మరింత రచ్చ రాజేసింది. ఈ పోస్ట్ ఎందుకు డిలీట్ చేశారన్న దానిపై స్పష్టత లేకపోవడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. తమదైన శైలిలో రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వచ్చిన నెగిటివ్ కామెంట్స్ వల్లే తీసేసారా? లేక సిస్టరూ అంటూ.. పొరపాటున పెట్టిన క్యాప్షన్ కారణంగా డిలీట్ చేశారా? అన్న అనుమానాలు బాలీవుడ్ వర్గాల్లో చర్చకు దారి తీశాయి. ఏదేమైనా, ఈ ఇద్దరు భామలు తమ రిలేషన్‌షిప్‌పై స్పష్టతనిచ్చే వరకు నెటిజన్లు రూమర్స్ ఆపేలా లేరు.

