Evelyn Sharma: సాహో ఫేం, ప్రముఖ నటి ఎవలీన్ శర్మ విడాకులు తీసుకుంది. తన భర్తతో విడిపోయినట్టు తాజాగా ఓ ఇంటర్య్వూలో వెల్లడించింది. తమ ఐదేళ్ల వివాహా బంధానికి గుడ్ బై చెప్పనుంది. ఈ విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఈ విషయంపై ఓ ఛానెల్‌లో మాట్లాడిన ఆమె.. భర్తతో విడిపోయినట్టు స్పష్టం చేసింది. ‘అవును మేమిద్దరం పరస్పరం అంగీకారంతోనే విడిపోవాలని నిర్ణయించుకున్నాం. కానీ, పిల్లల విషయంలో ఇద్దరం బాధ్యత తీసుకుంటాం‘ అని చెప్పుకొచ్చింది.
కాగా ఎవలిన్ శర్మ 2021 మే 15న డెంటల్ సర్జన్ అయిన తుషాన్ బిందీని పెళ్లి చేసుకుంది. వీరికి కుమార్తె ఆవా, కుమారుడు ఆర్డెన్ అనే ఇద్దరు పిల్లలు జన్మించారు. పెళ్లయిన ఐదేళ్లకే ఈ జంట విడాకులు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. స్నేహపూర్వకంగా తమ బంధానికి ముగింపు పలుకుతున్నామని ఎవలీన్ చెప్పారు. తమ పిల్లలను మాత్రం కలిసే పెంచుతామని కూడా స్పష్టం చేశారు. 2012లో హిందీ సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన ఎవలీన్.. 2019 వరకు బాలీవుడ్ లో రాణించారు. 2013లో విడుదలైన ‘యే జవానీ హై దీవానీ’ మూవీలో కీలక పాత్ర పోషిచింది. అలాగే 2014లో విడుదలైన ‘యారియాన్’, ‘మై తేరా హీరో’ చిత్రాల్లో కూడా నటించింది. ఇక తెలుగులో ప్రభాస్ మూవీ సాహోలో ఐషా పాత్రలో నటించి మెప్పించింది.
Also Read: Peddi Movie: ఫ్యాన్స్ గెట్ రెడీ.. ‘పెద్ది‘ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ముందుగానే థియేటర్లోకి

