Thursday, March 12, 2026
Homeచిత్ర ప్రభSai Pallavi: సాయిప‌ల్ల‌వి బాలీవుడ్ డెబ్యూ మూవీ రిలీజ్ ఇప్ప‌ట్లో లేనట్లేనా?

Sai Pallavi: సాయిప‌ల్ల‌వి బాలీవుడ్ డెబ్యూ మూవీ రిలీజ్ ఇప్ప‌ట్లో లేనట్లేనా?

Sai Pallavi: సాయిప‌ల్ల‌వి బాలీవుడ్ డెబ్యూ మూవీ మేరే ర‌హో రిలీజ్ ఎప్పుడ‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యి నాలుగైదు నెల‌లు దాటినా ప్రేక్ష‌కుల ముందుకు రాక‌పోవ‌డం హాట్ టాపిక్‌గా మారింది. టాలీవుడ్‌, కోలీవుడ్‌ల‌లో టాప్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా కొన‌సాగుతోంది సాయిప‌ల్ల‌వి. రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌కు భిన్నంగా ఢిప‌రెంట్ కాన్సెప్ట్‌ల‌తో సినిమాలు చేస్తూ ఆడియెన్స్‌ను మెప్పిస్తోంది. అమ‌ర‌న్‌, తండేల్ సినిమాల‌తో వ‌రుస‌గా బ్లాక్‌బ‌స్ట‌ర్స్‌ను అందుకున్న‌ది. సాయిప‌ల్ల‌వికి ద‌క్షిణాదిలో ఉన్న క్రేజ్ కార‌ణంగా టాప్ డైరెక్ట‌ర్లు, హీరోలు ఆమెతో సినిమాలు చేయ‌డానికి రెడీగా ఉన్నారు. డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. కానీ వారంద‌రికి హ్యాండిచ్చిన సాయిప‌ల్ల‌వి బాలీవుడ్‌కు షిప్ట‌య్యింది. మేరే ర‌హోతో పాటు రామాయ‌ణ సినిమాల‌కు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చింది. గ‌త ఏడాదిన్న‌ర‌గా ఈ హిందీ సినిమాల షూటింగ్‌ల‌తోనే బిజీగా ఉంది.

- Advertisement -

Also Read- The Rajasaab: ‘ది రాజాసాబ్‌’కి క్లైమాక్సే కీలకం.. మారుతి ప్లాన్ వర్కౌట్ అవుతుందా?

మేరే ర‌హో షూటింగ్ అక్టోబ‌ర్‌లోనే పూర్త‌య్యింద‌ని స‌మాచారం. బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ ఇందులో హీరోగా న‌టిస్తున్నారు. రొమాంటిక్ ల‌వ్ డ్రామాగా డైరెక్ట‌ర్ సునీల్ పాండే ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. న‌వంబ‌ర్‌లో మేరే ర‌హోను రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. కానీ ఆ డేట్‌కు సినిమా ప్రేక్ష‌కుల ముందుక రాలేదు. ఆ త‌ర్వాత డిసెంబ‌ర్ 12 అంటూ మ‌రో విడుద‌ల తేదీని అనౌన్స్‌చేశారు. రెండోసారి కూడా సినిమా పోస్ట్‌పోన్ అయ్యింది. స‌రైన బ‌జ్ లేక‌పోవ‌డంతోనే ఈ సినిమా వాయిదాప‌డుతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ధురంధ‌ర్‌తో పాటు మ‌రికొన్ని భారీ బ‌డ్జెట్ సినిమాలు డిసెంబ‌ర్‌లో ప్రేక్ష‌కుల ముందుకొచ్చాయి. వాటితో పోటి అంటే త‌న‌యుడి సినిమాకు న‌ష్టం అని భావించిన‌ ఆమిర్ ఖాన్ ఈ సినిమాను వాయిదా వేసిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఇటీవ‌లే మేరే ర‌హో సినిమా ఫ‌స్ట్ కాపీ చూసిన ఆమిర్‌ఖాన్ కొన్ని మార్పులు సూచించార‌ట‌. జునైద్ ఖాన్ కంటే సాయిప‌ల్ల‌వికే ఎక్కువ‌గా ఇంపార్టెన్స్ ఉన్న‌ట్లుగా క‌నిపించ‌డంతో వాటిని బ్యాలెన్స్ చేసేలా రీషూట్స్ చేయ‌మ‌ని ద‌ర్శ‌కుడితో చెప్పిన‌ట్లు బాలీవుడ్ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ రీషూట్స్ కంప్లీట్ అయిన త‌ర్వాతే ఈ సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని అనుకుంటున్నార‌ట‌. మేరే ర‌హో రిలీజ్‌కు జూలై మంచి టైమ్‌గా ఆమిర్‌ఖాన్ భావిస్తున్న‌ట్లు స‌మాచారం. అప్ప‌టివ‌ర‌కు సాయిప‌ల్ల‌వి బాలీవుడ్ డెబ్యూ మూవీ రిలీజ్ ఉండ‌క‌పోవ‌చ్చున‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

Also Read- Anupama Parameswaran: ప్రిన్సెస్ లుక్‌లో అనుపమ.. ఈ ఫోటోలు చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News