Homeచిత్ర ప్రభOTT: డైరెక్ట్ గా ఓటీటీకి క్రైం థ్రీల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

OTT: డైరెక్ట్ గా ఓటీటీకి క్రైం థ్రీల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

Saif Ali Khan kartavya OTT: బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం “కర్తవ్య”. ఈ క్రైమ్‌ ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌కు పుల్కిత్ దర్శకత్వం వహించగా గౌరీ ఖాన్ నిర్మించారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన కీలక అప్‌డేట్ విడుదలైంది. ముందుగా రిలీజ్ డేట్‌పై పలు రూమర్స్ వినిపించినప్పటికీ, ఇప్పుడు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

- Advertisement -

ఈ చిత్రాన్ని మే 15 నుంచి నేరుగా ఓటీటీలో విడుదల చేయనున్నారు. ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో ఈ మూవీ ప్రసారం కానుంది. “విధి వర్సెస్ కర్మ” అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ ఒక పోలీసు అధికారిగా కనిపించనున్నారు. క్రైమ్, సస్పెన్స్, ఇన్వెస్టిగేషన్ అంశాలతో ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండబోతోందని చిత్రబృందం తెలిపింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News